
జాతీయ స్థాయిలో రాణించాలి
● ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి నాగమణి
● అండర్–17 జిల్లా స్థాయి తైక్వాండో క్రీడాకారుల ఎంపిక
నిజామాబాద్‌నాగారం: క్రీడాకారులు రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణించి జిల్లాకు బంగారు పతకాలు తేవాలని ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి నాగమణి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఎన్నారై కాలనీలో తైక్వాండో మార్షల్ ఆర్ట్స్ అకాడమీ క్రీడా ప్రాంగణంలో గురువారం అండర్–17 బాలబాలికల విభాగంలో ఎంపికల పోటీలు నిర్వహించారు. ప్రతిభచూపిన వారిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. వచ్చే నెలలో నల్గొండ జిల్లాలో అండర్–17 తైక్వాండో పోటీలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో పీడీ ఈశ్వర్, కోచ్ ఫారుకి అబ్దుల్లా, కోచ్‌లు వినోద్ నాయక్, గయాస్, మనోజ్, వినోద్, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు. అనంతరం తైక్వాండో అండర్–17 క్రీడాకారులు నియామక అబ్జర్వర్‌లను ఘనంగా సన్మానించారు.
ఎంపికై న బాలికలు :
సారా ఫాతీమా, ఇన్సర్ నూరేన్, జైనాబ్, సాన్వి, సయ్యద్ సిమ్రా ఫాతిమా, అన్సరా మిదాత్, జామ్ల దర్శిని, నివేదిత, వర్షిణి, ఊర్మిళ, నేహ వాసవి, నూరేన్
బాలుర విభాగంలో..
అబ్దుల్ అజాన్‌షేక్, షేక్ అబ్దుల్లా ఓమర్, రయాన్ అబ్దుల్లా ఫారూఖ్, షేక్ ముస్తాపా రజన్, హరీశ్, ఇబ్రహీం ఎండీ అబ్దుల్, అమాన్ సింగ్, కాంచిపూరం సిద్ధార్థ, షేక్ రిజ్వాన్, రహీం, వేదాన్స్, హుస్సేన్, అమాన్

జాతీయ స్థాయిలో రాణించాలి