
ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
మాక్లూర్: చదువులో వెనుకబడి ఉన్నానన్న మనస్తాపంతో మండలంలోని చిక్లీ గ్రామానికి చెందిన దీమర వెంకట్(16) గురువారం సాయంత్రం గ్రామ శివారులో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మాక్లూర్ ఎస్సై రాజశేఖర్ కథనం ప్రకారం.. చిక్లీ గ్రామానికి చెందిన దీమర సాయిరెడ్డి, మంజుల కుమారుడు వెంకట్ డిచ్‌పల్లి మండలం ధర్మారం(బి)లోని ఓ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. చదువులో నెలవారీగా నిర్వహించే కామన్ పరీక్షలలో తోటి స్నేహితుల కంటే తక్కువ మార్కులు వస్తున్నాయన్న బాధతో ఉండేవాడని తెలిపారు. దీపావళి పండుగ కోసం నాలుగు రోజుల ముందే చిక్లీకి వచ్చాడు. గురువారం వెంకట్ గ్రామ శివారులో ఓ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి సాయిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు.
నిజామాబాద్ రూరల్: రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగాస్థాన్–1 లక్ష్మీనరసింహ అపార్టమెంట్‌లో గురువారం రాత్రి ఏసీపీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో సీసీఎస్ సీఐ సురేశ్, సాయినాథ్, ఎస్సైగోవింద్ కలిసి పేకాట స్థావరంపై దాడి చేశారు. పేకాడుతున్న 9 మందిని పట్టుకొని, 9 సెల్ ఫోన్లు, రూ.49,250 స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల కోసం రూరల్ ఎస్‌హెచ్‌వో మహ్మద్ ఆరీఫ్‌కు అప్పగించారు.
రుద్రూర్‌లో ముగ్గురు..
రుద్రూర్: మండలంలోని అక్బర్‌నగర్ శివారులో పేకాట స్థావరంపై బుధవారం రాత్రి ఎస్సై సాయ న్న ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేశారు. పేకాడు తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని, వారి నుంచి రూ.1100 స్వాధీనం చేసుకున్నారు. కేసు నమో దు చేసినట్టు ఎస్సై సాయన్న తెలిపారు.
రెంజల్(బోధన్): మండలంలోని కందకుర్తి శివారులో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును గురువారం తహసీల్దార్ శ్రావణ్‌కుమార్ తనిఖీ చేశారు. మహారాష్ట్ర నుంచి ధాన్యం అక్రమంగా జిల్లాలోకి ప్రవేశించకుండా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెండు రోజుల కిందట చెక్‌పోస్టును ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు. రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో 24 గంటల నిఘా ఉంటుందన్నారు. జిల్లాలో కొనుగోళ్లు పూర్తయ్యే వరకు చెక్‌పోస్టు కొనసాగుతుందని తెలిపారు.