
నెట్‌బాల్ ప్రాబబుల్స్ క్రీడాకారుల ఎంపిక
నిజామాబాద్‌నాగారం: ఉమ్మడి జిల్లా (నిజామాబాద్, కామారెడ్డి) నెట్‌బాల్ అండర్–19 విభాగంలో బాలబాలికల ప్రాబబుల్స్ జిల్లా జట్టుకు ఎంపిక నిర్వహించారు. సారంగాపూర్ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో బుధవారం పోటీలు నిర్వహించి ప్రతిభకనబర్చిన వారిని ఎంపిక చేశారు. శిక్షణ అనంతరం తుది జట్లను ఎంపిక చేయనున్నారు.
బాలికల విభాగం: డి అనుప్రియ, ఎన్ సింధు, డి ప్రతిభ, కె సరు, బి అక్షయ, యూ శృతి, ఏ రక్షిత,
ఎం ప్రణీత, సీహెచ్ పురంధరేశ్వరి, యూ సంకీర్తన, కె కీర్తన, పి రక్షిత, బి సింధు, డి బాణవి, పి అలేఖ్య.
బాలుర విభాగం: జాన్ ప్రభాస్, ఐ అజయ్‌కుమార్, కె అరవింద్, పి దేవేందర్, డి అభ్యుదయ,
డి సాయికుమార్, టి మహేశ్, హెచ్ నివర్తి, డి రాహుల్, ఎం నవనీత్, ఎండీ ముబాసిర్,
ఎస్ అభిలాష్, వి నిఖిల్, శివకాంత్.