
విద్యార్థులకు ఇబ్బందులు కలిగించొద్దు
● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
● జిల్లాలోని బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ యాజమాన్యాలతో సమావేశం
నిజామాబాద్ అర్బన్: బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం కింద ప్రయివేటు పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు యాజమాన్యాలు ఎలాంటి ఇబ్బందులు కలిగించొద్దని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. నగరంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కరెస్పాండెంట్లు, ప్రిన్సిపాల్స్‌తో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూన.. ఏమైనా సమస్యలు ఉంటే జిల్లా యంత్రాంగం, ప్రభుత్వం దృష్టికి తెచ్చి పరిష్కరించుకోవాలని యాజమాన్యాలకు సూచించారు. బెస్ట్ అవైలబుల్ స్కీం విద్యార్థులు పట్ల వివక్షను ప్రదర్శించకూడదని స్పష్టం చేశారు. బకాయిల చెల్లింపుల విషయమై ప్రభుత్వం సానుకూలంగా ఉందని, విద్యార్థులకు మెరుగైన విద్య, నాణ్యమైన వసతుల కల్పనకు చొరవ చూపాలన్నారు. అదనపు కలెక్టర్ అంకిత్, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.