ఎర్రజొన్నకు బదులు మొక్కజొన్న | - | Sakshi
Sakshi News home page

ఎర్రజొన్నకు బదులు మొక్కజొన్న

Oct 16 2025 5:01 AM | Updated on Oct 16 2025 5:01 AM

ఎర్రజ

ఎర్రజొన్నకు బదులు మొక్కజొన్న

సుమారు 30వేల ఎకరాల్లో..

వ్యాపారులు మోసం చేస్తున్నారు..

అధిక దిగుబడి సాధించాలి..

ఆర్మూర్‌: ఎర్రజొన్న రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగువైపు మొగ్గుచూపుతున్నారు. జిల్లాలో ప్రతీ ఏటా ఎర్రజొన్న రైతులను విత్తన వ్యాపారులు సిండికేట్‌గా మారి మోసం చేస్తుండటంతో అన్నదాతలు పంట మార్పిడి విధానాన్ని అవలంభించి వారి మోసాల బారిన పడకుండా జాగ్రత్త పడుతున్నారు. అందులో భాగంగా ఈ యాసంగిలో ఎర్రజొన్నకు బదులుగా మొక్కజొన్నను పండించడానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ప్రస్తుత సీజన్‌లో ఎర్రజొన్న విస్తీర్ణం తగ్గి మొక్కజొన్న విస్తీర్ణం గణనీయంగా పెరగనుంది.

గతంలో..

మార్కెట్‌లో మొక్కజొన్నకు డిమాండ్‌ ఉన్నా.. పెట్టుబడి వ్యయం, శ్రమ ఎక్కువ కావడంతోపాటు తెగుళ్లు సహా ఇతర కారణాలతో గతంలో మొక్కజొన్న విస్తీర్ణం గణనీయంగా తగ్గి, ఎర్రజొన్న విస్తీర్ణం పెరిగింది. కానీ ప్రతియేటా ఎర్రజొన్న విత్తన వ్యాపారులు బైబ్యాక్‌ ఒప్పందాలు చేసుకొని పంట చేతికి వచ్చిన సమయంలో కొనుగోలు చేయకుండా ముఖం చాటేయడంతో రైతులు వచ్చిన నామమాత్రపు ధరకే ఎర్రజొన్న పంటను అమ్ముకొని ఆర్థికంగా నష్టపోతున్నారు. దీంతో అన్నదాతలు ప్రస్తుతం ఎర్రజొన్నకు బదులుగా మొక్కజొన్న పండించడానికే ఆసక్తి చూపుతున్నారు.

అక్టోబర్‌ నెలలో విత్తుకొనే ఎర్రజొన్నల విస్తీర్ణం ప్రతీ ఏటా గణనీయంగా తగ్గుతూ వస్తోంది. 2023–24 యాసంగిలో 34,086 ఎకరాల్లో, 2024–25లో 25,447 ఎకరాల్లో ఎర్రజొన్నలు పండించారు. ప్రత్యామ్నాయంగా మొక్కజొన్నను పండించడానికి రైతులు ఆసక్తి చూపుతున్నారు. వ్యవసాయ శాఖ ముందస్తు ప్రణాళిక ప్రకారం ఈ యాసంగిలో మొక్కజొన్న పంట విస్తీర్ణం 30 వేల ఎకరాలకు చేరువలో ఉండబోతోంది. మొక్కజొన్న పచ్చి బుట్ట పంట 90 రోజుల్లో చేతికొస్తుంది. ఇలా వచ్చిన పచ్చి బుట్టల దిగుబడికి బహిరంగ మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది.

ఎర్రజొన్న విత్తన వ్యాపారులు బై బ్యాక్‌ ఒప్పందాన్ని ఉల్లంఘించి ప్రతీయేటా రైతులను మోసం చేస్తూనే ఉన్నారు. సిండికేట్‌గా మారిన వారిని ని యంత్రిండంలో ప్రభుత్వం వి ఫలం అవుతోంది. కాబట్టి ఎర్రజొన్నకు బదులు గా రైతులు మొక్కజొన్నను పండించడానికి ఆసక్తి చూ పుతున్నారు.–బార్ల మనీష్‌, రైతు, ఆలూర్‌ మండలం

రైతులు మొక్కజొన్న పంట పండించే సమయంలో మెరుగైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ పంట దిగుబడిని పెంచుకోవాలి. ఆర్మూర్‌, అంకాపూర్‌లో పచ్చిబుట్ట కొనుగోలుకు వ్యాపారులు ఆసక్తి చూపుతారు. కాబట్టి ఈ మార్కెట్‌ను ఉపయోగించుకోవాలి.

– హరికృష్ణ, వ్యవసాయశాఖ అధికారి, ఆర్మూర్‌

యాసంగిలో పెరుగుతున్న

మక్క సాగు విస్తీర్ణం

ఎర్రజొన్న వ్యాపారుల

మోసాలతో విసిగిపోతున్న రైతులు

ప్రత్యామ్నాయ పంటలవైపు మొగ్గు

ఎర్రజొన్నకు బదులు మొక్కజొన్న 1
1/2

ఎర్రజొన్నకు బదులు మొక్కజొన్న

ఎర్రజొన్నకు బదులు మొక్కజొన్న 2
2/2

ఎర్రజొన్నకు బదులు మొక్కజొన్న

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement