
ట్యాంకర్‌ను ఢీకొన్న బస్సు
● ముగ్గురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు
డిచ్‌పల్లి: మండలలోని హైవేపై ఓ ప్రయివేట్ బస్సు అదుపుతప్పి ఇంధన ట్యాంకర్‌ను ఢీకొని, సమీపంలోని ఏడో బెటాలియన్ పెట్రోల్ బంక్‌లోకి దూసుకెళ్లింది. ఈఘటనలో ముగ్గురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. డిచ్‌పల్లి ఎస్సై ఎండీ షరీఫ్ తెలిపిన వివరాలు ఇలా.. హరికృష్ణ ట్రావెల్స్‌కు చెందిన బస్సు బుధవారం హైదరాబాద్ నుంచి జగిత్యాలకు బయలుదేరింది. డిచ్‌పల్లిలోని పోలీస్ పెట్రోల్ బంక్ వద్దకు రాగానే బస్సు ముందు వెళుతున్న ట్యాంకర్‌ను ఢీకొని బంకులోకి దూసుకెళ్లింది. దీంతో పెట్రోల్ బంక్‌లో ఉన్న వాహనదారులు, సిబ్బంది ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే బస్సు సమీపంలోకి వచ్చి నిలిచిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బస్సులో ఉన్న ముగ్గురు ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి. అజాగ్రత్తగా బస్సు నడిపి ప్రమాదానికి కారణమైన డ్రైవర్ ప్రభాకర్ తేజపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఆర్మూర్‌టౌన్: పట్టణంలో ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొనడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. ఆర్టీసీ బస్సు నిజామాబాద్ నుంచి హన్మకొండకు బయలుదేరింది. ఈక్రమంలో పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో బైక్‌ను బస్సు వెనుకనుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయి. ఆర్టీసీ డ్రైవర్ ఆజాగ్రత్తగా వాహనాన్ని నడపడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి, ఇరువురిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు
విద్యుత్ షాక్‌తో జీపీ కార్మికుడికి ..
బీబీపేట: మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్మికుడు విద్యుత్ షాక్‌తో గాయపడ్డాడు. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన జీపీ కార్మికుడు కొంగరి చంద్రం బుధవారం పెద్దమ్మ ఆలయం సమీపంలో విద్యుత్ బల్బులు అమర్చడానికి స్తంభం ఎక్కాడు. అప్పటికే విద్యుత్ సరఫరా ఉండడంతో అతని చేతులకు విద్యుత్ షాక్ తగిలి కింద పడిపోయాడు. దీంతో కుడి కాలు విరిగింది. స్థానికులు వెంటనే అతడిని కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు.

ట్యాంకర్‌ను ఢీకొన్న బస్సు