
హెచ్‌యూఐడీ నంబరు అనే మాటే లేదు
బంగారు, వెండి ఆభరణాల వ్యాపారంలో లీగ ల్ మెట్రాలజీ శాఖ కేవ లం ఎలక్ట్రానిక్ కాంటా లు, తూకంల తనిఖీకే పరిమితమవుతోంది. వినియోగదారులు బంగారు, వెండి ఆభరణాల నాణ్యత విషయంలో మోసపోతున్నారు. అధికారులు నాణ్యత పరీక్షలు నిర్వహించడం లేదు. దీంతో వ్యాపారులు బిల్లులపై హెచ్‌యూఐడీ నంబరు వేయకుండానే విక్రయాలు చేస్తున్నా రు. వినియోగదారుల మండలి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 14 నుంచి 28వ తేదీ వర కు అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలపై కార్యక్రమాలు చేస్తున్నాం. వినియోగదారులను చైత న్యవంతులను చేస్తూ, నాణ్యతా లోపాలతో మోసపోయిన వినియోగదారులు.. వినియోగదారులు కమిషన్‌లలో ఫిర్యాదు చేసేవిధంగా కార్యక్రమాలను రూపొందించాం. దే శంలో ఇటీవల కాలంలో ఏకంగా 546 హాల్‌మా ర్క్ కేంద్రాల లైసెన్సులు రద్దు కావడాన్ని వినియోగదారుల హక్కుల పరిరక్షణ దృష్ట్యా అతిపెద్ద సమస్యగా పరిగణించాలి. ప్రపంచంలో అన్నివర్గాల ప్రజలకు పొదుపు మాంద్యంగా ఉన్న బంగారంపై ప్రమాణాల విధానం కఠినంగా అమలు చేయాల్సి ఆవశ్యకత ఉంది.
– సాంబరాజు చక్రపాణి, వినియోగదారుల
మండలి జాతీయ ప్రధాన కార్యదర్శి