
డీసీసీ పదవికి మాజీ ఎంపీపీ దరఖాస్తు
బోధన్: బోధన్ మాజీ ఎంపీపీ, టీపీసీసీ డెలిగేట్ బి.గంగాశంకర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్య క్ష పదవికి శనివారం జిల్లా కేంద్రంలోని కార్యా లయంలో దరఖాస్తు అందజేశారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి ముఖ్య అనుచరుడిగా ఉన్నారు.ఆయన వెంట పార్టీ మండల అధ్యక్షు డు నాగేశ్వర్‌రావు, నాయకులు దాము, గణప తి రెడ్డి, సంజీవ్ రెడ్డి తదితరులు ఉన్నారు.
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి
సుభాష్‌నగర్: కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన హామీ ప్రకారం 42శాతం రిజర్వేషన్లు, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీని అమలు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. తప్పుడు నిర్ణయాలతో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని, ఈ నిర్లక్ష్య ధోరణితో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్ల విషయంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సుప్రీంకోర్టును ఆశ్రయించి న్యాయపరమైన లొసుగులను సరి చేసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు పూర్తిగా మద్దతు తెలుపుతూ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఇకనైనా ప్రభుత్వం వెంటనే బీసీ రిజర్వేషన్లతోపాటు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
నిజామాబాద్‌అర్బన్: నగరంలోని వర్ని చౌరస్తాలో తిరుగుతున్న మతిస్థిమితం లేని బాలుడిని గుర్తించినట్లు ఐదో టౌన్ ఎస్సై శనివారం తెలిపారు. వర్ని చౌరస్తాలో బాలుడు తిరుగుతున్నట్లు స్థానికులు సమాచారం అందించడంతో బాబును పీఎస్‌కు తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. బాబు వివరాలు తెలిసిన వారు పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు.

డీసీసీ పదవికి మాజీ ఎంపీపీ దరఖాస్తు