
బదిలీ బంధాలు
డబ్బులు ఆదా అవుతాయి..
సన్న, చిన్నకారు రైతులకు ఉపయోగకరం..
కూలీల కొరత ఉండదు..
ఆర్మూర్ ప్రాంతంలో పసుపు కొమ్ములు ఏరుతున్న బదిలీకి వచ్చిన బంధువులు (ఫైల్)
టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న కొద్దీ.. మనుషుల మధ్య ఆత్మీయ పలకరింపులు కరువవుతున్నాయి. ఉరుకులు, పరుగుల జీవితంలో ఆప్యాయంగా మాట్లాడాల్సిన బంధువులు, కష్టసుఖాలను పంచుకునే తోబుట్టువుల మధ్య సైతం దూరం పెరుగుతోంది. ఇలాంటివి తమకేమీ పట్టవంటూ ఒకరికొకరు తోడుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఆర్మూర్ ప్రాంత రైతులు. నిద్రలేచిన నుంచే ఆత్మీయ పలకరింపులు మొదలవుతాయి. వ్యవసాయంలో అనాదిగా వస్తున్న సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. పరస్పర సహకారంతో కూలీల సమస్యను అధిగమించడంతోపాటు మానవ సంబంధాలను బలోపేతం చేసుకుంటున్నారు. బదిలీలతో సమష్టిగా వ్యవసాయం చేస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్న గ్రామీణ రైతాంగంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
ఆర్మూర్ : రోజురోజుకూ పెరిగిపోతున్న పెట్టుబడి వ్యయాన్ని తగ్గించుకోవడం కోసం ఆర్మూర్ ప్రాంత రైతాంగం బదిలీ బంధాలను ఏర్పరుచుకొని ఆదర్శంగా నిలుస్తోంది. తమ మధ్య గల బంధాలు, బంధుత్వాలు, స్నేహాలతో ఒకరికి ఒకరు తోడుగా నిలుస్తూ వ్యవసాయంలో రాణిస్తున్నారు. కూలీల ధరలు పె రిగిపోవడంతో వరి నాట్లు, కోతలు, మొక్కజొన్న, సోయా, పసుపు లాంటి పంటలు విత్తుకొనే సమ యంలో ఒకరికి ఒకరు బదిలీ కూలీగా వెళ్లి పనిని పంచుకుంటున్నారు. ఫలి తంగా పెట్టుబడి వ్యయాన్ని తగ్గించు కుంటున్నారు. ఒకవైపు కూలీల భారం లేకుండా వ్యవసా యం సాఫీగా సాగిపోతుండగా, మరోవైపు గ్రామాల్లో బంధాలు, బంధుత్వాలు, స్నేహాలు సై తం బలపడుతున్నాయి. గ్రామాల్లో మహిళలకు రో జు కూలీ రూ.500 ఉండగా పురుషులకు రూ. 1000 వరకు ఉంటుంది. గిట్టుబాటు ధరలు లభించని ప్రతికూల పరిస్థితుల్లో అంతంత పెట్టుబడి పెట్టే స్థోమత లేని వారు.. గ్రామంలో ఇతరులకు కూలీ గా వెళ్లడం ఇష్టపడని వారు తమ బంధువుల తో ట ల్లోకి బదిలీపై వెళ్లి వ్యయాన్ని తగ్గించుకుంటున్నా రు. మరోవైపు బదిలీకి వెళ్లిన రోజు మధ్యాహ్న సమయంలో బంధువులంతా కలిసి ముచ్చట్లు పెడుతూ సద్ది(భోజనం) తినడం.. ఒకరి వంటలు ఒకరు పంచుకోవడం వ్యవసాయ క్షేత్రాల్లో వనభోజనాలను తలపిస్తుంది. సమష్టి వ్యవసాయంతో ఈ ప్రాంత రైతుల తీరు ఆదర్శంగా నిలుస్తోంది.
సమష్టిగా వ్యవసాయ పనులు
కూలీల అవసరం లేకుండా
పరస్పర సహకారం
బలపడుతున్న మానవ సంబంధాలు
ఆదర్శం.. ఆర్మూర్ ప్రాంత రైతాంగం
వరి నాట్లు, కోతలు, పసుపు,
మొక్కజొన్న పంటల్లో
చేదోడు వాదోడుగా పనులు
పెద్ద ఆసాములకు కూలీకి వెళ్లడంతోపాటు ఖాళీ రోజుల్లో మా పొలంలో బంధువులను బదిలీకి పిలుస్తాను. లేదా నేను వారికి బదిలీ వెళతాను. బదిలీల కారణంగా పెట్టుబడి తగ్గి పంట అమ్మిన సమయంలో నాలుగు డబ్బులు నా కూలీగా మిగులుతాయి. అది చాలా ఆనందాన్నిస్తుంది. పని చేసే సమయంలో ఒకరి కష్టసుఖాలను మరొకరం పంచుకుంటాం.
– భోజమ్మ, రైతు, మాక్లూర్ మండలం
ఎకరం, రెండెకరాల వ్యవసాయం ఉన్న సన్న, చిన్నకారు రైతులకు బదిలీ కూలీలు ఎంతగానో ఉపయోగపడతాయి. పెద్ద ఆసాములు ఈ మధ్యకాలంలో బిహార్, మహారాష్ట్ర నుంచి వచ్చిన కూలీలకు గుత్తగా పనులు ఇచ్చేస్తున్నారు. మాలాంటి చిన్న రైతులు మాత్రం బదిలీలకు వెళ్తున్నాం.
– మీరప్పాల మల్లు, రైతు,
వల్లభాపూర్, మాక్లూర్ మండలం
చిన్న రైతులు పంటను పండించడం కోసం ట్రాక్టర్, హార్వెస్టర్లకే పెద్ద మొత్తం చెల్లిస్తున్నారు. ఇలాంటి సమయంలో కూలీల వ్యయం తగ్గించుకోవడానికి బదిలీలు ఉపయోగపడతాయి. గ్రామాల్లో బదిలీలు కొనసాగినన్ని రోజులు కూలీల కొరత ఉండదు.
– టీ సాయిలు, రైతు, మాక్లూర్ మండలం

బదిలీ బంధాలు

బదిలీ బంధాలు

బదిలీ బంధాలు

బదిలీ బంధాలు

బదిలీ బంధాలు