
లింబాద్రి గుట్ట జాతరలో పాల్గొనాలని ఎమ్మెల్యేకు ఆహ్వానం
కమ్మర్‌పల్లి(భీమ్‌గల్): భీమ్‌గల్‌లోని లింబాద్రి గుట్ట(నింబాచలం) లక్ష్మీ నరసింహస్వామి జాతరలో పాల్గొనాలని బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డిని సోమవారం ఆలయ అర్చకులు పార్థసారథి ఆహ్వానించారు. ఈమేరకు ఎమ్మెల్యేను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి, ఆహ్వాన పత్రికను అందజేసి, ఆశీర్వదించారు. వచ్చే నెల 5న జరిగే జాతరకు హాజరుకావాలని కోరారు.
దోమకొండ: బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందేనని బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలోని గాంధీచౌక్ వద్ద బీసీ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడారు. జనాభాలో ఎక్కువ శాతం ఉన్న బీసీలకు రాజకీయంగా అన్యాయం జరుగుతుందన్నారు. ప్రతి పార్టీ బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. నాయకులు ఐరేని నర్సయ్య, తీగల తిర్మల్‌గౌడ్, అబ్రబోయిన స్వామి, రాజేందర్, మర్రి శేఖర్, తదితరులు పాల్గొన్నారు.

లింబాద్రి గుట్ట జాతరలో పాల్గొనాలని ఎమ్మెల్యేకు ఆహ్వానం