
నిందితుడిని అరెస్టు చేయాలి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయిపై దాడికి యత్నించిన నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కనుక ప్రమోద్, ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల నాయకులు ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు. ప్రమోద్ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి అంటే ప్రజాస్వామ్యం మీద దాడిగా చూడాలన్నారు. గవాయి దళితుడు కాబట్టి ఈ దాడి జరిగిందన్నారు. జిల్లా అధ్యక్షుడు సరికెల పోశెట్టి సీనియర్ నాయకులు మైలారం బాలు. జాతీయ ఉపాధ్యక్షుడుగంగారం, సురేష్ నాంపల్లి, మారుతి, యమున, స్వప్న, భూమయ్య, ప్రవీణ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.