
పోలీస్ ప్రజావాణికి 20 ఫిర్యాదులు
నిజామాబాద్‌అర్బన్: నగరంలోని పోలీస్ కమిషనరేట్‌లో సోమవారం నిర్వహించిన పోలీస్ ప్రజావాణి కార్యక్రమంలో 20 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి సీపీ సాయి చైతన్య అర్జీలను స్వీకరించారు. ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఫిర్యాదుదారుల అర్జీలను చట్టప్రకారం పరిష్కారం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. సమస్య, స్థితిని పరిష్కారానికి సూచనలు చేశారు. ప్రజలు నిర్భయంగా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి పైరావీలు లేకుండా స్వచ్ఛందంగా పోలీసు సేవలను వినియోగించుకుంటూ, సమస్యలను చట్టప్రకారం పరిష్కరించుకోవాలన్నారు. పోలీసులు ప్రజలకు మరింత దగ్గర అయ్యేలా శాంతిభద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పనిచేస్తుందన్నారు.