
ముగిసిన అటవీశాఖ స్పోర్ట్స్ మీట్
నిర్మల్‌టౌన్: జిల్లాకేంద్రంలోని డిగ్రీ కళాశాల మైదానంలో అటవీశాఖ ఆధ్వర్యంలో రెండు రోజులుగా నిర్వహించిన స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఆదివారం రాత్రి అట్టహాసంగా ముగిసింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా జిల్లా జడ్జి శ్రీవాణి, అటవీశాఖ బాసర సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ శర్వానన్ హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. పోటీల్లో నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాలకు చెందిన సుమారు 350 మంది అటవీశాఖ క్రీడాకారులు పాల్గొనగా 35 రకాల క్రీడలు నిర్వహించారు. టగ్ ఆఫ్ వార్ పురుషుల విభాగంలో నిర్మల్ జట్టు, మహిళల విభాగంలో ఆదిలాబాద్ జట్టు విజేతగా నిలిచాయి. వాలీబాల్‌లో ప్రథమ విజేతగా ఆదిలాబాద్, రన్నరప్‌గా నిర్మల్ జట్టు, క్రికెట్‌లో నిజామాబాద్ జట్టు, కబడ్డీ పురుషుల విభాగంలో నిజామాబాద్, మహిళల విభాగంలో నిర్మల్ జట్టు, త్రోబాల్ మహిళల విభాగంలో ఆదిలాబాద్ జట్టు, మార్చ్‌పాస్ట్‌లో నిర్మల్ జట్టు విజేతగా నిలిచాయి. ఓవరాల్ ఛాంపియన్స్ ట్రోఫీని నిర్మల్ జట్టు కై వసం చేసుకుంది. నిజామాబాద్ డీఎఫ్‌వో వికాస్ మీనా, నిర్మల్ డీఎఫ్‌వో నాగిని భాను, అధికారులు సుధాకర్‌రావు, శివకుమార్, నాలుగు జిల్లాల అటవీశాఖ అధికారులు, సిబ్బంది తదితరు లు పాల్గొన్నారు.