
నిధులు విడుదల చేయాలి
పెండింగ్‌లో ఉన్న బెస్ట్ అవైలబుల్ స్కూల్స్‌కు సంబంధించి 250 కోట్ల రూపాయలను విడుదల చేయాలని బోధన్ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు వారు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. నాయకులు నవాతే ప్రతాప్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్‌కు సుమారు 250 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయని, వాటిని వెంటనే రిలీజ్ చేయాలన్నారు. లేదంటే రాష్ట్రంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామన్నారు. నాయకులు దేవర్ల నాగరాజు, రాజన్న, గౌతమ్ కుమార్, సంజయ్, మోసిన్, బాలరాజ్, ప్రశాంత్, శ్రీకాంత్ మోహన్, కిరణ్, సతీష్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.