
విద్యార్థులకు దీన్‌దయాల్ స్పర్శ్‌యోజన పోటీలు
సిరికొండ: మండలంలోని సత్యశోధక్ పాఠశాలలో ఆదివారం తపాలా శాఖ ఆధ్వర్యంలో దీన్‌దయాల్ స్పర్శ్ యోజన రాష్ట్రస్థాయి జనరల్ నాలెడ్జ్ పోటీ పరీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా నిజామాబాద్ సబ్ డివిజన్ తపాలా శాఖ సహయ పర్యవేక్షకులు సుష్మితాబెనర్జీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పోస్టల్ పిలాటలి అకౌంట్ ఉన్న ఆరు నుంచి తొమ్మిదవ తరగతి విద్యార్థులకు ప్రతి ఏడాది పోటీ పరీక్షను నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులలో తపాలాశాఖపైన అవగాహన, స్టాంపుల సేకరణ అలవాటును పెంపొందించి విజేతలైన విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించి ప్రోత్సహిస్తుందన్నారు. విద్యార్థులకు తపాలా శాఖ తరపున పరీక్ష ప్యాడ్లు, పెన్నులు అందజేశారు. ప్రిన్సిపాల్ నర్సయ్య, సబ్ పోస్ట్ మాస్టర్లు మహేందర్, రాజ్‌కుమార్, వెంకటదాస్, గోపాల్, స్నేహిత్, ప్రవీణ్, లింగం, గంగారెడ్డి, రాజు, శంకర్, రవి, శ్రీధర్ పాల్గొన్నారు.