
హత్య కేసులో ఏడుగురి రిమాండ్
మద్నూర్(జుక్కల్): యువకుడి హ త్య కేసులో ఏడుగురు నిందితులను అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం సాయంత్రం బాన్సువాడ డీఎస్పీ విఠల్‌రెడ్డి, బి చ్కుంద సీఐ రవికుమార్, ఎస్సై విజయ్‌కొండ వివరాలు వెల్లడించారు. సోమూర్ గ్రా మానికి చెందిన రాజ్‌కుమార్, భీంరావ్, తేజరావ్, సూర్యకాంత్, పండిత్‌రావ్, రాచప్ప, హన్మంత్, రామ్‌నాథ్ వరుసకు అన్నదమ్ములు. గత నెల 28న భీంరావ్‌కు రాజ్‌కుమార్ డబ్బులు బాకీ ఉండగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. డబ్బులు తక్కువ చెల్లిస్తున్నావని భీంరావ్ రాజ్‌కుమార్‌ను ప్రశ్నించాడు. దీంతో రాజ్‌కుమార్ భీంరావ్‌ను దుర్భాషలాడాడు. భీంరావ్‌తోపాటు తేజరావు, సూర్యకాంత్, పండిత్‌రావ్, రాచప్ప, రామ్‌నాథ్, హన్మంత్‌లు కలిసి రాజ్‌కుమార్‌పై దాడి చేయడంతో తీవ్రగాయాలయ్యాయి. రాజ్‌కుమార్‌ను స్థానికులు నిజామాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఈ నెల 6న మృతి చెందాడు. మృతుడి తండ్రి బస్వంత్ ఫిర్యాదు మేరకు ఏడుగురిపై హత్య కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు.