
ముగిసిన రాష్ట్రస్థాయి తైక్వాండో టోర్నీ
జాతీయస్థాయికి ఎంపికయ్యా
నిజామాబాద్‌నాగారం: నగరంలోని వినాయక్‌నగర్‌లో ఉన్న మున్నూరుకాపు సంఘంలో కొనసాగుతున్న రాష్ట్రస్థాయి అండర్–14 ఎస్‌జీఎఫ్ తైక్వాండో టోర్నీ శనివారం ముగిసింది. జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యదర్శి నాగమణి ఆధ్వర్యంలో బాలబాలికలకు వివిధ కేటగిరీల్లో తైక్వాండో పోటీలు నిర్వహించారు. ప్రతిభ చూపిన క్రీడాకారులకు బంగారు, రజత, కాంస్య పతకాలు అందించారు. పోటీల్లో మనస్విని(నిజామాబాద్), జునేరియాకుల్‌సమ్(నల్గొండ), సమన్విత(రంగారెడ్డి), కతిజాఫాతిమా(నిజామాబాద్), మగేశ్ మెహరిన్(రంగారెడ్డి), హారిక(రంగారెడ్డి), సమీక్ష(రంగారెడ్డి), టి. వైష్ణవి(హైదరాబాద్),చొక్కం ఓంకార్(నిజామాబాద్), జె.శశిధర్ (నిజామాబాద్) బంగారు పతకాలు సాధించారు. వీరు ఈ నెల 28 నుంచి నాగాలాండ్‌లో నిర్వహించే జాతీయస్థాయి పోటీలకు ఎంపికై నట్లు నాగమణి పేర్కొన్నారు. ఈ పోటీలు ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఈశ్వర్, పరిశీలకుడు రాజశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. తైక్వాండో అసోసియేషన్ జిల్లా అధ్యక్షు డు అజ్మత్, ప్రధాన కార్యదర్శి మాస్టర్ వినోద్‌నాయ క్, పీడీలు గోపిరెడ్డి, శ్రీధర్, సురేశ్ పాల్గొన్నారు.
నేను 8వ తరగతి చదువుతున్నాను. గతేడాది ఎస్‌జీఎఫ్ టో ర్నీలో పాల్గొని రాష్ట్రస్థాయిలో ర న్నర్‌గా నిలిచి రజత పతకం సాధించాను.ఈసారి ఎలాగైనా బంగారు పతకం సాధించాలనే కసితో కోచింగ్ తీసుకున్నాను. మొదటిసారి బంగారు పతకం సాధించి జాతీయస్థాయికి ఎంపికవ్వ డం చాలా సంతోషంగా ఉంది.
– హారిక, రంగారెడి్డ

ముగిసిన రాష్ట్రస్థాయి తైక్వాండో టోర్నీ

ముగిసిన రాష్ట్రస్థాయి తైక్వాండో టోర్నీ