
మరమ్మతు పనుల పరిశీలన
నిజామాబాద్‌అర్బన్: అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న మరమ్మతు పనులను డీఐఈవో రవికుమార్ శుక్రవారం పరిశీలించారు. ప్రిన్సిపల్ బుద్ధిరాజు ఆధ్వర్యంలో కళాశాలలో చేపడుతున్న సివిల్ పనుల నిర్వహణపై సంతృప్తిని వ్యక్తంచేశారు. తరగతి గదులలో చిన్నచిన్న మరమ్మతులు, విద్యుత్ మరమ్మతు పనులు వెంటనే పూర్తిచేయాలని సూచించారు. అనంతరం సీఎస్‌ఐ జూనియర్ కళాశాల, ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాలలను డీఐఈవో ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రిన్సిపాళ్లు, బోధనేతర సిబ్బందితో సమావేశమై విద్యార్థుల అపార్, యుడైస్ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.