
సీఎం పర్యటనలో కట్టుదిట్టమైన బందోబస్తు
పర్యవేక్షించిన ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి, సీపీ సాయిచైతన్య
ఖలీల్‌వాడి: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన సందర్భంగా పోలీసులు శుక్రవారం నగరంలో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా సీపీ సాయిచైతన్య ఉదయం నగరంలోని శ్రావ్య గార్డెన్‌లో పోలీస్ సిబ్బందితో సమా వేశమై పలు సూచనలు చేశారు. డ్యూటీ స్థలం విడి చి ఎక్కడికి వెళ్లొద్దని, సిబ్బంది అలర్ట్‌గా ఉండాలని ఆదేశించారు.
సీఎం పర్యటన బందోబస్తులో ఏసీపీలు, సీఐలు, ఎస్సైలు, ఏఎస్సైలు, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, మహిళా సిబ్బంది, హోంగార్డులతో కలిపి మొత్తం 600 మంది పాల్గొన్నారు. నగరంలోని మాధవనగర్ బైపాస్, కంఠేశ్వర్ బైపాస్, అర్సపల్లి, ఆర్‌ఆర్ ఎక్స్ రోడ్డు, పులాంగ్, రుక్మిణి చాంబర్, బోర్గాం(పి) బ్రిడ్జి తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సీఎం కాన్వాయ్ వెళ్లే సమయంలో అన్ని వైపులా వాహనాలను నిలిపివేశారు.
సీఎం పర్యటన నేపథ్యంలో నగరంలో ఏర్పాటు చేసిన బందోబస్తును ఐజీపీ ఎస్.చంద్రశేఖర్‌రెడ్డి పర్యవేక్షించారు. సీపీ సాయిచైతన్యను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమీకృత కలెక్టరేట్‌లో సీఎం రేవంత్‌రెడ్డికి సీపీ సాయిచైతన్య పుష్పగుచ్ఛం అందజేశారు. బందోబస్తులో అదనపు డీసీపీ (అడ్మిన్) బస్వారెడ్డి, ఏసీపీలు రాజా వెంకటరెడ్డి, వెంకట్ రెడ్డి, శ్రీనివాస్, నాగేంద్ర చారి, రాజశేఖర్, మస్తాన్ అలీ తదితరులు పాల్గొన్నారు.

సీఎం పర్యటనలో కట్టుదిట్టమైన బందోబస్తు