
అంతర్జాతీయ స్థాయిలో రాణించడం గర్వకారణం
● అర్బన్ ఎమ్మెల్యే
ధన్‌పాల్ సూర్యనారాయణ
● అట్టహాసంగా ప్రారంభమైన ఎస్జీఎఫ్ అండర్–14 తైక్వాండో టోర్నీ
నిజామాబాద్ నాగారం: జిల్లా కేంద్రంలో సరైన మైదానాలు లేకపోయినప్పటికీ ప్రతిభచాటుతూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించడం క్రీడాకారుల గొప్పతనమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. ఎస్‌జీఎఫ్ అండర్–14 తైక్వాండో టోర్నీని ఎమ్మెల్యే ధన్‌పాల్ శుక్రవారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ గ్రామీణస్థాయి క్రీడాకారులను ప్రోత్సహిస్తుంటే, రాష్ట్రంలో మాత్రం గత ప్రభుత్వం క్రీడాకారులకు తగిన ప్రోత్సాహం అందించకపోవడం దురదృష్టకరమన్నారు. జిల్లా కేంద్రంలో ప్రత్యేకంగా ఓ క్రీడా మైదానం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతిపత్రాలు అందించినప్పటికీ ప్రభుత్వం కేటాయించకపోవడం దారుణమన్నారు. జిల్లాలో క్రీడా మైదానం ఏర్పాటు కోసం వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎస్జీఎఫ్ కార్యదర్శి నాగమణి, డీవైఎస్‌వో పవన్ కుమార్, ఒలింపిక్ సంఘం జిల్లా కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య, పేట సంఘం అధ్యక్షులు విద్యాసాగర్ రెడ్డి, గోపిరెడ్డి, మల్లేశ్ గౌడ్, డీసీసీబీ సెక్రెటరీ సీతయ్య, తైక్వాండో అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు అజ్మత్, కార్యదర్శి వినోద్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.