
అంకాపూర్‌ను సందర్శించిన పొలాస విద్యార్థులు
పెర్కిట్(ఆర్మూర్): ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామాన్ని జగిత్యాల జిల్లా పొలాస వ్యవసాయ కళాశాల విద్యార్థులు శుక్రవారం సందర్శించారు. క్షేత్ర సందర్శనలో భాగంగా అంకాపూర్‌లో రైతులు సాగు చేస్తున్న పంటలను ప్రత్యక్షంగా పరిశీలించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన విత్తన అభివృద్ధి కేంద్రాలను సందర్శించారు. దీంతోపాటు రైతులు సాగు చేస్తున్న అంతర పంటలు, నీటి యాజమాన్య పద్ధతులపై అంకాపూర్ సొసైటీ సభ్యుడు కేకే భాజన్నను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పొలాస వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు రమేశ్, జయంత్, శ్రావణ్, శ్రీకాంత్, రంజిత్, కే నర్సారెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.