
నిజామాబాద్
న్యూస్‌రీల్
ఇతర రాష్ట్రాల్లో జీఐ ట్యాగ్ పొందిన పసుపు రకాలు..
జీఐ ట్యాగింగ్‌తో డిమాండ్
పిల్లలను ఫోన్‌కు దూరంగా..
సెల్ ఫోన్ ప్రభావం పిల్లలపై అధికంగా ఉంద ని సీనియర్ సివిల్ జడ్జి ఉదయ భాస్కర్ రావు అన్నారు. ఫోన్‌కు దూరంగా ఉంచాలన్నారు.
శనివారం శ్రీ 11 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
– 8లో u
పరిశోధన స్థానంలో సాగవుతున్న ఆర్మూర్ పసుపు రకం పంట
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి 75 వేల 394 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 21 వరద గేట్ల ద్వారా 65,604 క్యూసెక్కుల నీటిని అధికారులు గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వారా 4 వేలు, ఎస్కేప్ గేట్ల ద్వారా 4 వేలు, సరస్వతి కాలువ ద్వారా 650, మిషన్ భగీరథ ద్వారా 231, ఆవిరి రూపంలో 709 క్యూసెక్కుల నీరు పోతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా శుక్రవారం సాయంత్రానికి ప్రాజెక్ట్‌లో 1090.90(80.05 టీఎంసీలు) అడుగులు నీరు నిల్వ ఉందని అధికారులు పేర్కొన్నారు.
మోర్తాడ్(బాల్కొండ): వరద కాలువకు గండిపడిన చోట మరమ్మతులు పూర్తి చేయడానికి యుద్ధ ప్రాతిపదికన అంచనాలను తయారు చేయాలని ఆపరేషన్స్, మెయింటెనెన్స్ ఇంజినీర్ ఇన్ చీఫ్ శ్రీనివాస్ ఆదేశించారు. శుక్రవారం ఆయన మోర్తాడ్ మండలం గాండ్లపేట్ శివారులోని వరద కాలువ అక్విడెక్ట్‌ను పరిశీలించారు. గండిపడిన చోట పనులు వేగంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. మూడు రోజుల్లో అంచనాలను రూపొందించి పంపించాలని సూచించారు. ఆయన వెంట సెంట్రల్ డిజైన్ చీఫ్ ఇంజినీర్ సత్యనారాయణరెడ్డి, ఎస్సారెస్పీ సీఈ సుధాకర్‌రెడ్డి, ఎస్‌ఈ జగదీశ్వర్, ఈఈ చక్రపాణి, డీఈ గణేశ్, ఏఈఈలు పాల్గొన్నారు.
నిజామాబాద్ సిటీ: నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవితోపాటు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవులను త్వరలో భర్తీచేయనున్నట్లు డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ ఎన్నికలను పరిశీలించేందుకు ఏఐసీసీ, కర్ణాటక రాష్ట్ర ఎమ్మెల్యే రిజ్వాన్ అర్షద్‌ను నియమించింది. ఆయన పర్యవేక్షణలోనే ఎన్నికల ప్రకియ కొనసాగనుంది. పదవుల కోసం పోటీచేసే ఆశావహులు ఈ నెల 12 లోపు జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్‌లో దరఖాస్తులు అందజేయాలని మోహన్‌రెడ్డి సూచించారు.
కమ్మర్‌పల్లి: ఆర్మూర్ ప్రాంతంలో సాగయ్యే పసుపు పంటకు ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తీసుకురావడం కోసం కమ్మర్‌పల్లి మండల కేంద్రంలోని పసుపు పరిశోధన కేంద్రం సంకల్పించింది. తరతరాలుగా ఈ ప్రాంత రైతులు పండిస్తున్న సంప్రదాయ వైరెటీ ఎర్ర గుంటూర్ రకం పసుపు పంటకు భౌగోళిక గుర్తింపు (జీఐ ట్యాగ్) తీసుకురావడం కోసం, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం, వనపర్తి జిల్లా మోజర్ల ఉద్యాన కళాశాల శాత్రవేత్త సైదయ్య ఆధ్వర్యంలో పసుపు పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ బి మహేందర్, శ్రీనివాస్, నా బార్డ్, ఉద్యాన, మార్కెటింగ్ శాఖల అధికారులు రైతు సహకార సంఘాలతో కలిసి ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. ఈ బృందం సభ్యులు ఆర్మూర్, నిర్మల్, మెట్‌పల్లి, జగిత్యాల, మహబూబబాద్ ప్రాంతాల్లో పర్యటించి పసుపు పంటల సాగు విస్తీర్ణాన్ని పరిశీలించి జీఐ ట్యాగ్‌కు అవసరమైన ఆధారాలు సేకరించారు. ఈ పసుపు రకానికి ప్రత్యేకమైన సువాసన, రంగు, ఔషధ గుణాలు ఉన్నట్లు గుర్తించారు. భౌగోళిక గుర్తింపు (జీఐ ట్యాగ్) కోసం గత నెలలో చైన్నెలోని మేధో సంపత్తి హక్కుల కార్యాలయం (జీఐ ట్యాగ్ రిజిస్ట్రేషన్)లో దరఖాస్తు చేయగా రిజిస్ట్రీ ఆమోదం తెలిపింది.
బ్రాండ్ నేమ్‌తో మంచి ధర
ఆర్మూర్ ప్రాంతంలో సాగయ్యే ఎర్ర గుంటూర్ రకం పసుపు పంటకు శాస్త్రవేత్తల బృందం ఆర్మూర్ పసుపుగా నామకరణం చేసి జీఐ ట్యాగింగ్ (భౌగోళిక గుర్తింపు)కు దరఖాస్తు చేశారు. బ్రాండ్‌కు చట్టపరమైన రక్షణ కల్పించడమే భౌగోళిక గుర్తింపు. దీన్ని దృష్టిలో ఉంచుకొని చేసేదే ‘ది జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్(రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్) యాక్ట్ 1999’ ఈ భౌగోళిక గుర్తింపు వల్ల ఈ ప్రాంతంలోని ఉత్పత్తికి అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. దీనివల్ల పంటకు డిమాండ్ ఏర్పడి అధిక ధర లభిస్తుంది. ఆర్మూర్ పసుపునకు జీఐ ట్యాగ్ ఇచ్చే ప్రక్రియను ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ రకం పసుపు అధిక దిగుబడి రావడంతో పాటు, నాణ్యత, శక్తివంతమైన రంగు, అధిక కుర్కుమిన్ శాతం కోసం ప్రసిద్ధి చెందింది. భౌగోళిక గుర్తింపుతో అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ ఏర్పడుతుంది. రైతులకు మంచి ధర, మెరుగైన మార్కెటింగ్, ఎగుమతి అవకాశాలను మెరుగుపడతాయి. వినియోగదారులకు నాణ్యతపై నమ్మకం పెరుగుతుంది. రైతుల ఉత్పత్తిదారుల హక్కులను కాపాడుతుంది. స్థానిక సంస్కృతి పరిరక్షణకు సహాయపడుతుంది. బ్రాండ్ నేమ్‌తోనే పసుపు ఉత్పత్తి చేయడం, విక్రయించడానికి అనుమతి ఉంటుంది. దీనివల్ల మంచి ధరతో పాటు, వ్యాపార అవకాశాలను సృష్టిస్తుంది. రైతుల ఆదాయం పెరుగుతుంది.
తమిళనాడులో ప్రత్యేక లక్షణాలతో ఈరోడ్ మంజల్ పసుపు
మహారాష్ట్రలో ఆసియాలోనే పసుపునకు అతిపెద్ద వ్యాపార కేంద్రంగా ప్రసిద్ధి చెందిన సంగాలి రకం పసుపు, అదేవిధంగా అధిక కుర్కుమిన్ శాతం, సువాసనకు ప్రసిద్ధి చెందిన వైగావ్ రకం పసుపు.
ఒడిశాలో ఘాటైన వాసన, ఔషధ గుణాలు కలిగిన కంధమాల్ హల్దీ రకం పసుపు
మేఘాలయలో అత్యధిక కుర్కుమిన్ శాతం కలిగిన లకడోంగ్ రకం పసుపు.
ఆర్మూర్ పసుపునకు జీఐ ట్యాగింగ్‌తో ప్రపంచ మార్కెట్‌లో డిమాండ్ ఏర్పడుతుంది. పరిశోధన బృందం సభ్యులందరం కలిసి క్షేత్ర స్థాయిలో పసుపు పంటను పరిశీలించి ఆధారాలు సేకరించాం. సెప్టెంబర్‌లో జీఐ ట్యాగింగ్‌కు దరఖాస్తు చేశాం. రిజిస్ట్రీ ఆమోదం తెలిపింది. మూడు నెలల్లో ఆర్మూర్ పసుపునకు జీఐ ట్యాగింగ్ లభిస్తుంది. ఆర్మూర్ ప్రాంత రైతులకే హక్కులు ఉంటాయి.
– డాక్టర్ బి. మహేందర్, ప్రధాన శాస్త్రవేత్త, పసుపు పరిశోధన స్థానం, కమ్మర్‌పల్లి
భౌగోళిక గుర్తింపునకు కమ్మర్‌పల్లి పసుపు పరిశోధన స్థానం కృషి
సెప్టెంబర్‌లో దరఖాస్తు, రిజిస్ట్రీ ఆమోదం
జీఐ ట్యాగ్‌తో పంటకు మంచి ధర,
మార్కెటింగ్, ఎగుమతి అవకాశాలు మెరుగు
వర్షాలతో నష్టపోయిన
రైతులను ఆదుకోవాలి
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు
ఏర్పాటు చేయాలి
‘అర్బన్’ అభివృద్ధికి సహకరించాలి
సీఎం రేవంత్‌రెడ్డికి
బీజేపీ ఎమ్మెల్యేల వినతి
ముఖ్యమంత్రి పర్యటనలో
బీజేపీ నిరసన సెగలు

నిజామాబాద్

నిజామాబాద్

నిజామాబాద్

నిజామాబాద్

నిజామాబాద్

నిజామాబాద్