ఆర్వోబీల పనులు పూర్తిచేయాలి | - | Sakshi
Sakshi News home page

ఆర్వోబీల పనులు పూర్తిచేయాలి

Oct 11 2025 5:48 AM | Updated on Oct 11 2025 5:48 AM

ఆర్వో

ఆర్వోబీల పనులు పూర్తిచేయాలి

ఆర్వోబీల పనులు పూర్తిచేయాలి

అభివృద్ధిలో స్తబ్ధత

సుభాష్‌నగర్‌: జిల్లాలోని అర్సపల్లి, అడవి మామిడిపల్లి, మాధవనగర్‌ అండర్‌ రైల్వే బ్రిడ్జి(ఆర్వోబీ)ల నిర్మాణానికి నిధులు కేటాయించి పనులు పూర్తి చేయాలని నిజామాబాద్‌ అర్బన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యేలు ధన్‌పాల్‌ సూర్యనారాయణ, పైడి రాకేశ్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్‌ పటేల్‌ డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు శుక్రవారం నిరసన తెలియజేశారు. మొదట ఆర్వోబీల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని బీజేపీ కార్యాలయం వద్ద పార్టీ అధ్యక్షుడు దినేశ్‌ పటేల్‌ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం పర్యటనను ఎక్కడ అడ్డుకుంటారోనని పోలీసులు బీజేపీ నాయకులను అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. బీజేపీ శ్రేణులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులు భారీగా మోహరించారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డికి వినతిపత్రం అందజేసేందుకు కలెక్టరేట్‌కు వెళ్లిన ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులకు కేవలం వినతి పత్రం ఇవ్వాలని పోలీసులు చెప్పడంతో వారు అక్కడే అందోళనకు దిగారు. ఎమ్మెల్యేలు సహా నాయకులు కలెక్టరేట్‌లో కింద కూర్చొని నిరసన తెలియజేశారు. అనంతరం పోలీసుల అనుమతితో ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు సీఎంను కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లు, డబుల్‌ బెడ్‌రూం కింద నియోజకవర్గానికి 3500 మంజూరైతే.. స్థలం కొరత వల్ల కేవలం 1757 మాత్రమే కేటాయించారని అన్నారు. మిగతా 1743 ఇండ్లు చంద్రశేఖర్‌నగర్‌ కాలనీలో ప్రభుత్వమే భూమిని కేటాయించి ఇళ్ల నిర్మాణం చేపట్టాలని కోరారు. నాగారంలో డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల మరమ్మతులకు కేటాయించిన రూ.1.25 కోట్లకు అదనంగా సరిపడా నిధులు మంజూరు చేయాలన్నారు. జీజీహెచ్‌ అభివృద్ధికి నిధులు కేటాయించాలని, ఇంటిగ్రేడెట్‌ పాఠశాల నిర్మాణానికి అనువుగా జీవోలో మార్పులు చేయాలని కోరారు. సీడీపీ నిధులు విడుదల చేయాలని, ఎస్‌డీఎఫ్‌ నిధులు రూ.10 కోట్లు కేటాయించాలన్నారు. మున్సిపాలిటీలో రోడ్లు, పార్కులకు, జంక్షన్ల అభివృద్ధి కోసం రూ.100 కోట్ల ప్రణాళిక సిద్ధం చేశామని, వాటికి అవసరమయ్యే నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. అత్యాధునిక మౌలిక సదుపాయాలతో బస్టాండ్‌ను అభివృద్ధి చేయాలన్నారు. అర్బన్‌ నియోజకవర్గ అభివృద్ధి కోసం చేసిన ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలించి తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.

జిల్లాలో భారీ వర్షాల కారణంగా మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారని, వెంటనే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు కొనుగోలు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్‌ పటేల్‌ డిమాండ్‌ చేశారు. పీఎం నిధులతో ఆమోదం పొందిన పనులు ఆలస్యమవుతున్నాయని, అభివృద్ధిలో స్తబ్ధత నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్వోబీలను తక్షణమే పూర్తి చేయాలని, పనులు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించి ఆదుకోవాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధానకార్యదర్శులు నాగోళ్ల లక్ష్మీనారాయణ, న్యాలం రాజు, శంకర్‌రెడ్డి, పద్మారెడ్డి, తారక్‌ వేణు, నాగరాజు, పిల్లి శ్రీకాంత్‌, దొంతుల రవి, ఆమంద్‌ విజయ్‌, పంచరెడ్డి శ్రీధర్‌, సాయివర్ధన్‌, ఆకుల శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

ఆర్వోబీల పనులు పూర్తిచేయాలి1
1/2

ఆర్వోబీల పనులు పూర్తిచేయాలి

ఆర్వోబీల పనులు పూర్తిచేయాలి2
2/2

ఆర్వోబీల పనులు పూర్తిచేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement