నిజామాబాద్‌ | - | Sakshi
Sakshi News home page

నిజామాబాద్‌

Oct 10 2025 6:26 AM | Updated on Oct 10 2025 6:26 AM

నిజామ

నిజామాబాద్‌

రిజర్వేషన్ల విషయం.. నామినేషన్లు దాఖలు..

న్యూస్‌రీల్‌

ఈసీ మార్గదర్శకాలను పాటించాలి

రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలు, నియమాలను అధికారులు, అభ్యర్థులు కచ్చి తంగా పాటించాలని కలెక్టర్‌ సూచించారు.

శుక్రవారం శ్రీ 10 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2025

IIలో u

స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల నేపథ్యంలో.. పరిషత్‌ మొదటి విడత ఎన్నికలకు నామినేషన్ల దాఖలు మొదటి రోజే ఎన్నికలను నిలిపేస్తూ హైకోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బీసీ రిజర్వేషన్ల స్థానాలు అనుకూలంగా వచ్చిన పోటీదారులు తీవ్ర నిరాశలో పడిపోయారు. కోర్టు జోక్యంతో ఎక్కడ రిజర్వేషన్లు మారిపోతాయోనని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు రిజర్వేషన్లు అనుకూలంగా రాని వారు కాలం కలిసి వస్తుందేమోనని ఆశాభావంతో ఎదురుచూస్తున్నారు.

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌ : బీసీ రిజర్వేషన్ల నేపథ్యంలో అనేక మలుపులు తిరుగుతూ వచ్చిన స్థాని క సంస్థల ఎన్నికల అంశం మరిన్ని చర్చలకు తెరతీసింది. శాసనసభ తీర్మానం, గవర్నర్‌ వద్ద ఫైల్‌ పెండింగ్‌, ప్రభుత్వం జీవో విడుదల చేయడం, ఎన్నిక ల కమిషన్‌ షెడ్యూల్‌ ప్రకటించడం, మొదటి విడత నోటిఫికేషన్‌ ఇవ్వడం, హైకోర్టుకు వెళ్లడం.. ఇన్ని ప రిణామాల మధ్య వివిధ వర్గాల్లో అనేక రకాల చర్చ లు జరిగాయి. ఎవరి విశ్లేషణ వారిదే అన్నట్లుగా కథ నడిచింది. చివరకు హైకోర్టు ఆదేశాలతో ఎన్నికలకు బ్రేకు పడింది. పరిషత్‌ మొదటి విడత ఎన్నికలకు నామినేషన్ల దాఖలు మొదటి రోజే ఎన్నికలను నిలి పేస్తూ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. నా లుగు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని కోర్టు పేర్కొంది. మరో రెండు వారాల్లో పిటిషనర్‌ కౌంటర్‌ ఇవ్వాలంది. దీంతో ఎన్నికల ప్రక్రియ మరింత ఆలస్యం అవుతోంది. వచ్చే జనవరిలో మాత్రమే ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గా లు అంచనాలు వేస్తున్నాయి.

స్థానిక ఎన్నికల అంశం మొత్తం బీసీ రిజర్వేషన్ల చుట్టూ తిరుగుతుండగా, తాజాగా కోర్టు ఆదేశాలతో కొందరిలో నిరాశ, మరికొందరిలో ఆశలు పెరుగుతున్నాయి. ఆయా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీల స్థానాలకు రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చిన వారు బరిలో దిగేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. వారిలో తాజాగా కోర్టు తీర్పుతో నిరాశ నెలకొంది. మరోవైపు రిజర్వేషన్ల కారణంగా తమకు పోటీ చేసే అవకాశం రాలేదని నిరాశ చెందుతున్నవారిలో మళ్లీ ఆశలు చిగురించాయి. మళ్లీ రిజర్వేషన్లు మారాతాయా అంటూ చర్చోపచర్చలు జరుగుతున్నాయి.

జిల్లాలో మొదటి విడతలో గురువారం 18 మండలాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్‌ నామినేషన్ల స్వీకరణ మొదలు పెట్టింది. డిచ్‌పల్లి జెడ్పీటీసీకి ఒక నామినేషన్‌ దాఖలైంది. అదే మండలంలో రెండు ఎంపీటీసీ నామినేషన్లు దాఖలయ్యాయి. కోటగిరి మండలంలో నాలుగు ఎంపీటీసీ స్థానాలకు నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. మాక్లూర్‌ మండలంలో ఒక ఎంపీటీసీ నామినేషన్‌ దాఖలైంది. మోపాల్‌ మండలంలో ఒక ఎంపీటీసీ స్థానానికి నామినేషన్‌ దాఖలైంది. బోధన్‌ రెవెన్యూ డివిజన్‌లో ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు కాలేదు.

అంతా ఇదే చర్చ..

మహారాష్ట్రలో గతంలో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యాక, ఫలితాలు ప్రకటించిన తరువాత సైతం సదరు ఎన్నికలను సుప్రీంకోర్టు రద్దు చేయడంతో ఆయా పార్టీల నాయకుల్లో తీవ్రమైన చర్చ జరిగింది. ప్రస్తుతం తాజాగా వచ్చిన కోర్టు ఆదేశాలకు ముందు వరకు కూడా రిజర్వేషన్లు ఉంటాయా.. మారతాయా, నామినేషన్లు వేసినప్పటికీ ఎన్నికలు సజావుగా జరుగుతాయా.. లేదా, డబ్బులు ఖర్చు చేసుకుని ఎన్నికల్లో విజయం సాధిస్తే ఈ ఎన్నికలను కోర్టు అంగీకరిస్తుందా.. రద్దు చేస్తుందా అనే విషయంలో తర్జనభర్జన పడ్డారు. ఈ నేపథ్యంలోనే హైకోర్టు ఎన్నికలను నిలిపేయడంతో ఆశావహులు నిర్వేదం చెందుతున్నారు.

వెనుతిరిగిన అభ్యర్థులు..

మాక్లూర్‌–2 ఎంపీటీసీ స్థానానికి ఒకరు నామినేషన్‌ దాఖలు చేశారు. సాయినేని వెంకేశ్వరరావు అనే అభ్యర్థి ముహూర్తం చూసుకుని భారీగా అనుచరులతో తరలివచ్చి నామినేషన్‌ వేశారు. అయితే అప్పటికే కోర్టు స్టే ఇచ్చిందని తెలియడంతో నిరాశ చెందాడు. అదేవిధంగా కొత్తపల్లి ఎంపీటీసీ స్థాఽనానికి కాంగ్రెస్‌ నుంచి చంద్రయ్య, మాక్లూర్‌ ఎంపీటీసీ–2 స్థానంలో బీజేపీ అభ్యర్థి సురేష్‌నాయక్‌ నామినేషన్‌ దాఖలు చేసేందుకు వచ్చి కోర్టు స్టేతో దాఖలు చేయకుండానే తిరిగి వెళ్లిపోయారు.

స్థానిక ఎన్నికలు నిలిపేస్తూ హైకోర్టు ఆదేశాలతో భిన్న స్వరాలు

నామినేషన్లకు రంగం సిద్ధం

చేసుకున్నవారికి చుక్కెదురు

తమకు అనుకూలంగా రిజర్వేషన్లు రానివారిలో ఆశలు

జనవరి వరకు ఎన్నికలకు బ్రేకు

పడినట్లేనా.. పలువురి అంచనాలు

నిజామాబాద్‌1
1/2

నిజామాబాద్‌

నిజామాబాద్‌2
2/2

నిజామాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement