
అధిక ఆదాయం.. అత్యధిక పోటీ
ఖలీల్‌వాడి: రాష్ట్రప్రభుత్వం 2025–2027 వరకు మ ద్యం షాపుల నిర్వహణకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. రూ. 3లక్షల చలాన్‌తో సెప్టెంబర్ 26 నుంచి ఎక్సైజ్ అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నా రు. జిల్లా వ్యాప్తంగా 102 మద్యం షాపులు ఉన్నా యి. అయితే, గతంలో పలు వైన్ షాపులకు వచ్చిన దరఖాస్తుల ఆధారంగా ప్రస్తుతం కూడా వాటికే అధిక డిమాండ్ ఉంటుందని ఎకై ్సజ్ వర్గాలు భావిస్తున్నాయి. రెండేళ్ల కాలపరిమితిలో రూ.కోట్లలో వ్యాపారం జరగడంతో వ్యాపారులు అధిక ఆదా యం వచ్చే మద్యం షాపులపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. వాటిని దక్కించుకునేందుకు గ్రూ పులుగా ఏర్పడి దరఖాస్తులు చేసేందుకు సిద్ధమవుతున్నారు. నగరానికి చెందిన ఓ యువకుడు వివిధ గ్రూపులతో కలిసి సుమారు 50 వరకు దరఖాస్తులు చేస్తున్నట్లు తెలిసింది.
జిల్లాలో 12 వైన్ షాపులకు 2023, 2024 సంవత్స రంలో ఎక్కువగా దరఖాస్తులు వచ్చినట్లు ఎకై ్సజ్ సూపరిండెంట్ మల్లారెడ్డి తెలిపారు. మానిక్‌భండార్‌లోని మద్యం షాపుకు 112 దరఖాస్తులు రాగా, సె ప్టెంబర్ వరకు లిక్కర్ విక్రయం ద్వారా రూ.26 కో ట్ల ఆదాయం వచ్చింది. దీంతో ఈసారి మరో వైన్స్ కు అవకాశం కల్పించారు. కాగా, ఇదే ప్రాంతంలో బార్ రావడంతో గతంమాదిరిగా ఈ వైన్స్‌కు దర ఖాస్తులు వస్తాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
మద్యం దుకాణాల దరఖాస్తులకు ఈ నెల 18 న సా యంత్రం 5 గంటల వరకు అవకాశం ఉంది. గతంలో గడువు ముగింపు దశలో అత్యధిక దరఖాస్తులు వచ్చాయి. ఈసారీ అదే మాదిరిగా దర ఖాస్తుదారు లు అత్యధిక సంఖ్యలో వస్తాయని భావించిన ఎక్సై జ్ అధికారులు వ్యాపారులకు ఇబ్బందులు కలుగకుండా ఆర్మూర్ ప్రాంత దరఖాస్తులను నిజామాబాద్ ఎక్సైజ్‌శాఖ కార్యాలయంలో స్వీకరించేందుకు ఏర్పాట్లు చేశారు. గురువారం సాయంత్రం వరకు 102 దుకాణాలకు 88 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి వెల్లడించారు.
జిల్లాలో పలు మద్యం
దుకాణాలకు క్రేజీ
గతంలో ఒక్కో వైన్స్‌కు 53 నుంచి
112 వరకు దరఖాస్తులు
సెప్టెంబర్ వరకు లిక్కర్ ద్వారా రూ.18.85 కోట్ల నుంచి
రూ.35 కోట్ల ఆదాయం