
కాకతీయ కాలువ కట్ట భద్రమేనా !
ప్రతిపాదనలు పంపించాం..
● ప్రమాదకరంగా కాలువ కట్ట
● ఏళ్లతరబడి ప్రతిపాదనలు..
లభించని మోక్షం
బాల్కొండ : శ్రీ రాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి నీటి సరఫరా చేసే కాకతీయ కాలువ కట్ట భద్రతపై ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా రు. గాండ్లపేట్ వద్ద వరద కాలువ అక్విడెక్ట్‌కు గండి పడిన నేపథ్యంలో.. కాకతీయ కాలువ పరిస్థితి కూడ అధ్వానంగా ఉందంటున్నారు. కాకతీయ కాలువ జీరో పాయింట్ వద్ద గత కొంతకాలంగా కట్ట కుంగుతోంది. దీంతో కాలువ కట్టను సిమెంట్ బస్తాల్లో ఇసుక నింపి అడ్డుగా వేశారు. మరమ్మతుల కోసం రూ. 10 లక్షలు మంజూరై రెండేళ్లు గడుస్తున్నా పనులు చేపట్టడం లేదు. అదేవిధంగా పోచంపాడ్ శశివారులో వాటర్ ట్యాంక్ వద్ద కాకతీయ కాలువ కట్ట మరింత ప్రమాదకరంగా ఉంది. వాటర్ ట్యాంక్ నుంచి మిగులు నీటిని కాలువలోకి మళ్లించుటకు పైపు వేశారు. దీనివల్ల కాలువ కట్ట మరింత కోతకు గురైంది. కాలువ కట్టకు ఇది వరకే గండి ఏర్పడింది. మరింత పెద్దగా గండి పడితే కాలువ నీరు పోచంపాడ్ కాలనీలోకి వెళ్లే ప్రమాదం ఉంది. అదేవిధంగా కాకతీయ కాలువ పొడవునా సిమెంట్ లైనింగ్ ధ్వంసం కావడంతో కాలువ కట్ట ప్రమాదకరంగా మారింది. కాలువకు గండి పడక ముందే మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
కాకతీయ కాలువ మరమ్మతుల కోసం ప్రభుత్వానికి పలు మార్లు ప్రతిపాదనలు పంపించాం. ఇప్పటి వరకు నిధులు మంజూరు కాలే దు. దీంతో పనులు చేపట్టలేక పోయాం. నిధు లు మంజూరు కాగానే పనులను చేపడుతాం.
– రఘుపతి, డిప్యూటీఈఈ, కాకతీయ కాలువ

కాకతీయ కాలువ కట్ట భద్రమేనా !