
స.హ. చట్టం పకడ్బందీగా అమలు చేయాలి
నిజామాబాద్‌అర్బన్: సమాచార హక్కు చట్టాన్ని ప కడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. స.హ. చట్టం ప్రవేశపెట్టి 20 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని గురువారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమాన్ని నిజామాబా ద్ కలెక్టరేట్‌లో ఆయా శాఖల అధికారులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు.
సమాచార హక్కు చట్టం అమలుపై రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేయించిన ప్రతిజ్ఞలో అన్ని శాఖల పీఐవో, ఏపీఐవోలు పాల్గొని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా సమాచార చట్టాన్ని పక్కాగా అమ లు చేస్తూ, నిజామాబాద్ జిల్లాకు కూడా అవార్డులు సాధించి ప్రత్యేక గుర్తింపు తేవాలని కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ సందీప్, ఏవో ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.