
బీసీలను మోసగిస్తున్న కాంగ్రెస్, బీజేపీ
వేల్పూర్: కాంగ్రెస్, బీజేపీ లు కలిసి బీసీలను మోసగిస్తున్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్ర శాంత్‌రెడ్డి ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లపై హైకో ర్టు ఇచ్చిన తీర్పుపై గురువారం ఆయన స్పందిస్తూ ప్రకటన విడుదల చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకా రం 50 శాతం కంటే ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వాలంటే 10వ షెడ్యూల్‌లో చేర్చి రాజ్యాంగ సవరణ తప్పని సరి చేయాలన్న వాస్తవం తెలిసి కూడా కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలను కాంగ్రెస్ మోసగించిందన్నారు. రాజ్యాంగ సవరణ కోసం 22 నెలలుగా ఢిల్లీ లో పోరాటం చేయకుండా కాంగ్రెస్ గల్లీలో మాత్రం డ్రామాలు ఆడిందన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో కాంగ్రెస్ ధర్నా చేసినప్పుడు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జునఖర్గే ఇలా ఏ ఒక్కరూ రాలేదన్నారు.ప్రధానమంత్రి మోదీ కూడా కాంగ్రెస్‌తో కలిసి బీసీ రిజర్వేషన్లు పెరగకుండా చూస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీలో కాంగ్రెస్ నిజాయితీగా పోరాటం చేస్తే తాము కూడా వారితో కలిసి పనిచేస్తామన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై చిత్తశుద్ధితో పనిచేయాలని డిమాండ్ చేశారు.