
పలుచోట్ల నామినేషన్ల దాఖలు
● ఏర్పాట్లు చేసిన అధికారులు
● కోర్టు తీర్పుతో వెనుదిగిరిన అభ్యర్థులు
బోధన్ /డిచ్‌పల్లి /మోపాల్ /రుద్రూర్ /మాక్లూర్: స్థానిక సంస్థల ఎన్నికల తొలి విడత నోటిఫికేషన్ గురువారం ఉదయం విడుదలైంది. దీంతో అప్పటి కే ఆయా మండలాల అధికారులు నామినేషన్ల స్వీకరణకు కేంద్రాలను ఏర్పాటు చేశారు. డిచ్‌పల్లి, మోపాల్, కోటగిరి, మాక్లూర్ మండలాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. డిచ్‌పల్లిలో జెడ్పీటీసీ స్థానానికి మాజీ ఎంపీపీ కంచెట్టి గంగాధర్, మిట్టాపల్లి ఎంపీటీసీ స్థానానికి అంబటి శైలజ (కాంగ్రెస్), నడిపల్లి– 2 ఎంపీటీసీ స్థానానికి మాజీ సర్పంచ్ పాశం లావణ్య (కాంగ్రెస్) నామినేషన్ దాఖలు చేశారు. మోపాల్ మండలంలోని న్యాల్‌కల్ ఎంపీటీసీ స్థానానికి అసది విద్యాసాగర్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలుచేశారు. అంతకుముందు నామినేషన్ దాఖలు కేంద్రాలను అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అంకిత్ పరిశీలించారు. కోటగిరి –1 ఎంపీటీసీ స్థానానికి మూడు, కోటగిరి–2 స్థానానికి ఒక్క నామినేషన్ దాఖలైంది. కాగా, సాయంత్రం స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ ఈసీ ప్రకటించడం విశేషం. మాక్లూర్–2 ఎంపీటీసీ స్థానానికి గురువారం సాయంత్రం నాలుగున్నర గంటలకు సాయినేని వెంకటేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. మంచి ముహూర్త సమయాన్ని ఎన్నుకొని అనుచరులతో తరలివచ్చి నామినేషన్ వేశారు. అప్పటికే కోర్టు నాలుగు వారాలు స్టే ఇచ్చిందని తెలియడంతో కంగుతిని వెళ్లిపోయారు. కొత్తపల్లి ఎంపీటీసీ అభ్యర్థిగా చంద్రయ్య, మాక్లూర్ ఎంపీటీసీ–2 స్థానానికి బీజేపీ అభ్యర్థి సురేశ్‌నాయక్ సైతం నామినేషన్ వేసేందుకు వచ్చి వెనుదిరిగారు.

పలుచోట్ల నామినేషన్ల దాఖలు

పలుచోట్ల నామినేషన్ల దాఖలు

పలుచోట్ల నామినేషన్ల దాఖలు