సిరికొండ: విద్యుత్ సరఫరాకు సంబంధించి మరమ్మతు పనులను వేగవంతం చేయాలని ఎస్‌ఈ రవీందర్ సిబ్బందిని ఆదేశించారు. మండలంలోని పెద్ద వాల్గోట్, చిన్న వాల్గోట్, కొండూర్ గ్రామాల్లో ఆగస్టు నెలలో కురిసిన భారీ వర్షాలకు విద్యుత్ శాఖకు జరిగిన నష్టాన్ని ఎస్‌ఈ గురువారం పరిశీలించారు. డిచ్‌పల్లి డీఈ కామేశ్వర్‌రావు, ఏడీఈ శ్రీనివాస్, ఏఈ చంద్రశేఖర్ ఉన్నారు.
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని పీజీ ఇంటిగ్రేటెడ్ కోర్సులు (అప్లయిడ్ ఎకనామిక్స్, ఇంటిగ్రేటెడ్ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ) 7, 9వ సెమిస్టర్ థియరీ, ప్రాక్టికల్ పరీక్షల ఫీజును ఈ నెల 23 వరకు చెల్లించాలని కంట్రోలర్, ప్రొఫెసర్ సంపత్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రూ.100 అపరాధ రుసుముతో ఈ నెల 25 వరకు ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఏపీ ఈ అన్ని సబ్జెక్టులకు కలిపి రూ.500లు, ఐపీసీ హెచ్ అన్ని సబ్జెక్టులకు కలిపి రూ.600 లు పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని విద్యార్థులకు సూచించారు.
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు కులాచారి దినేశ్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రాజ్యాంగ నిబంధనలు, కోర్టు అడ్డంకులు వస్తాయని తెలిసినప్పటి కీ కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి.. బీసీ రిజర్వేషన్ల విషయమై కుట్రపూరితంగా వ్య వహరించారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కులా చారి దినేశ్ ఆరోపించారు. ఈ మేరకు గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అ న్ని అంశాలు తెలిసినప్పటికీ, బీసీ సంఘాలు మొత్తుకున్నప్పటికీ జీవో నంబర్9 జారీ చేసి ఇష్టం వచ్చినట్లు నాటకమాడారన్నారు. తమిళనాడులో జయలలిత హయాంలో న్యాయపరమైన చిక్కులు రాకుండా చేసుకున్నారన్నారు. ఇక్కడ మాత్రం అలాంటి ప్రయత్నం చేయకుండానే బీసీలను, తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు కుట్ర చేశారన్నారు. కాంగ్రెస్‌ను బీ సీలు, తెలంగాణ ప్రజలు ఇకపై నమ్మరన్నారు.
మద్నూర్(జుక్కల్): విద్యుత్ తీగలు తగలడంతో మండలంలోని దన్నూర్ శివారులో సాగువుతున్న చెరుకు తోట దగ్ధమైనట్లు బాధితుడు దేవ్‌కత్తే మారుతి తెలిపారు. గురువారం ప్రమాదవశాత్తు చెరుకుతోటకు విద్యుత్ తీగలు తగలడంతో మంటలు వ్యాపించాయని పేర్కొన్నా రు. మద్నూర్ ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి మంటలను ఆర్పివేశారు. ప్రమాదంలో రూ. 1.50 లక్షల పంట నష్టం జరిగిందని, సకాలంలో వచ్చి రూ.2.50 లక్షల విలువజేసే పంటను కాపాడినట్లు అగ్నిమాపక అధికారి మాధవ్ తెలిపారు. సిబ్బంది హరీశ్, సంతోష్, సహదేవ్ ఉన్నారు.
నిజామాబాద్‌నాగారం: ఎస్‌జీఎఫ్ అండర్–14 బాలబాలికల విభాగంలో కబడ్డీ, వాలీబాల్ జిల్లాస్థాయి పోటీలు ఈ నెల 13న నిర్వహించనున్నట్లు క్రీడల కార్యదర్శి నాగమణి గురువారం ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు పాత కలెక్టరేట్ మైదానంలో పోటీలు ఉంటాయన్నారు. ప్రతిభ చూపిన వారిని ఈ నెల 16న సంగారెడ్డిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు పంపుతామని తెలిపారు. వివరాలకు 9347216426 నెంబర్‌లో సంప్రదించాలని పేర్కొన్నారు.
పనులను వేగవంతం చేయాలి