
26 నుంచి తీర్థయాత్రలకు ప్రత్యేక రైళ్లు
● జనవరి వరకు దేశీయ ఎయిర్ ప్యాకేజీ
● ఐఆర్‌సీటీసీ టూరిజం అసిస్టెంట్
మేనేజర్ పీవీ వెంకటేశ్ వెల్లడి
నిజామాబాద్‌నాగారం: తీర్థయాత్రలకు వెళ్లే వారి కోసం రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చిందని ఐఆర్‌సీటీసీ టూరిజం అసిస్టెంట్ మేనేజర్ పీవీ వెంకటేశ్ తెలిపారు. నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఆయన మాట్లాడారు. ఈ నెల 26 నుంచి నవంబర్ 4వ తేదీ వరకు ప్రత్యేక రైళ్లు, అక్టోబర్ నుంచి జనవరి వరకు దేశీయ ఎయిర్ ప్యా కేజీలను హైదరాబాద్ నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. భవ్య గుజరాత్ తీర్థయాత్రలో భాగంగా ద్వారకాదీష్ మందిరం, నాగేశ్వర జ్యోతిర్లింగ మందిరం, బేట్ ద్వారక, సోమనాథ్ జ్యోతిర్లింగ మందిరం, సబర్మతి ఆశ్రమం, సూర్యదేవాలయం, రాణికి వావ్, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ప్రాంతాలను సందర్శ న ఉంటుందని పేర్కొన్నారు. ఒక్కొక్కరికి సాధా రణ టికెట్ ధర రూ.18,400(స్లీపర్), రూ. 30,200 (3 ఏసీ), రూ. 39,900 (2ఏసీ) అని తెలిపారు. రైలు, బస్సు, హోటల్, భోజన సదుపాయం కల్పిస్తామని వివరించారు. దేశీయ ఎయిర్ ప్యాకేజీలో భాగంగా అండమాన్, కశ్మీర్, కర్ణాటక, రాజస్థాన్, ఒడిశా, తమిళనాడులోని పలు ప్రాంతాల్లో ఆరు లే దా ఏడు రోజుల యాత్ర ఉంటుందని పేర్కొన్నారు. ప్రాంతాల మేరకు రూ.34,950 నుంచి రూ.56,625 వరకు చార్జీలు ఉంటాయన్నారు. అంతర్జాతీయ ఎయిర్ ప్యాకేజీలో భాగంగా థాయ్‌లాండ్, శ్రీలంక, దుబాయ్ దేశాల సందర్శన ఉంటుందని, అందులో భాగంగా ఒక్కొక్కరికి రూ.64,500 నుంచి రూ.1,12,250 వరకు చార్జీలు ఉంటాయని తెలిపారు. వివరాలకు 9701360701, 9281030711 నెంబర్లను సంప్రదించాలన్నారు. సమావేశంలో టూరిజం మానిటర్లు నరేశ్‌బాబు ఓర్సు, కొక్కుల ప్రశాంత్ పాల్గొన్నారు.