
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెరిగేలా చూడాలి
డిచ్‌పల్లి: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవం చేయించుకునేలా గర్భిణులను ప్రోత్సహించాలని జిల్లా మలేరియా అధికారి తుకారాం రాథోడ్ సూచించారు. సాధారణ ప్రసవంతో కలిగే లాభాలు, శస్త్రచికిత్సతో కలిగే నష్టాలను గర్భిణులకు వివరించాలన్నారు. డిచ్‌పల్లి సామాజిక ఆరోగ్య కేంద్రంలో గురువారం ఆశా కార్యకర్తల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. కీటక జనీత వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. నీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించి తొలగించాలన్నారు. జ్వరానికి సంబంధించి రక్త పరీక్షలు చేయాలని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆశా కార్యకర్తలు కచ్చితంగా గర్భిణులతో ఫోలిక్ యాసిడ్(ఐరన్) మాత్రలు తినిపించాలని ఆదేశించారు. సమావేశంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి షారోన్ షైని క్రిస్టినా, వైద్యులు రాజశ్రీ, మండల ఆరోగ్య విస్తరణ అధికారి వై.శంకర్, ఆరోగ్య పర్యవేక్షకులు అక్బర్ అలీ, దేవపాలం తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెరిగేలా చూడాలి