
యువత పొగాకుకు దూరంగా ఉండాలి
● డీఎంహెచ్‌వో రాజశ్రీ
నిజామాబాద్‌నాగారం: విద్యార్థులు, యువత ప్రతి ఒక్కరూ పొగాకు దూరంగా ఉంటూ, మంచి మా ర్గంలో ఉన్నత శిఖరాల వైపు నడవాలని డీఎంహెచ్‌వో రాజశ్రీ తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో టొబాకో ఫ్రీ యూత్ క్యాంపెయిన్ కార్యక్రమాన్ని గురువారం అర్సపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం డీఎంహెచ్‌వో మాట్లాడుతూ 60 రోజులపాటు జిల్లాలో టొబాకో ఫ్రీ యూత్ క్యాంపెయిన్ నిర్వహిస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, కళాశాలలన్నీ టొబాకో ఫ్రీగా గుర్తించడం, కనీసం 30 టొబాకో ఫ్రీ గ్రామాలుగా గుర్తించడం జరుగుతుందన్నారు. పొగాకు ఉత్పత్తులను అక్రమంగా విక్రయించే వారిపై చర్యలు తీసుకుంటామని తెలి పారు. జిల్లా సైకియాట్రిస్ట్ డాక్టర్ రవితేజ మా ట్లాడుతూ విద్యార్థులు పాన్, గుట్కా, సిగరెట్, డ్ర గ్స్ లాంటి వాటికి దూరంగా ఉండాలన్నారు. పొ గాకు ఉత్పత్తులు, డ్రగ్స్ తీసుకుంటే శారీరక, మానసిక అనారోగ్యాలు, రుగ్మతలు సంభవిస్తాయన్నా రు. కార్యక్రమంలో హెచ్‌ఎం, ఎంఈవో ఆర్‌వీఎన్ గౌడ్, ఎన్‌సీడీ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సామ్రాట్ యాదవ్, మెడికల్ ఆఫీసర్ శ్రావణ లక్ష్మి, ఆర్‌బీ ఎస్‌కే వైద్యులు విజయభాస్కర్, జిల్లా సైన్స్ అధికా రి కస్తూరి గంగాకిషన్ తదితరులు పాల్గొన్నారు.