కొనసాగుతున్న నీటి విడుదల | - | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న నీటి విడుదల

Oct 9 2025 2:45 AM | Updated on Oct 9 2025 2:45 AM

కొనసా

కొనసాగుతున్న నీటి విడుదల

పౌష్టికాహారాన్ని తీసుకోవాలి

బాల్కొండ: శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌లోకి ఎగువ నుంచి 60 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. దీంతో 16 వరద గేట్ల ద్వారా 50 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. బుధవారం ఉదయం ఎగువ నుంచి వరద తగ్గుముఖం పట్టడంతో నీటి విడుదలను 25 వేల క్యూసెక్కులకు తగ్గించారు. మధ్యాహ్నం మళ్లీ ఇన్‌ఫ్లో పెరగడంతో అవుట్‌ ఫ్లోను పెంచారు. ప్రాజెక్ట్‌ నుంచి కాకతీయకాలువ ద్వారా 4 వేల క్యూసెక్కులు, ఎస్కేప్‌ గేట్ల ద్వారా 4 వేలు, సరస్వ తి కాలువ ద్వారా 650, మిషన్‌ భగీరథ ద్వారా 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా, ఆవిరి రూపంలో 709 క్యూసెక్కుల నీరు పోతోంది. ప్రాజెక్ట్‌ పూర్తి స్థాయి నీటి మట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా బుధవారం సాయంత్రానికి 1090.90(80.05 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని ప్రాజెక్ట్‌ అధికారులు తెలిపారు.

నవీపేట: గర్భిణులు పౌష్టికాహారాన్ని తీసుకోవాలని ఐసీడీఎస్‌ పీడీ రసూల్‌బీ సూచించారు. మండల కేంద్రంలోని రైతువేదికలో బుధవారం ఏర్పాటు చేసిన పోషణ్‌ మాసోత్సవంలో ఆమె మాట్లాడారు. పౌష్టికాహారాన్ని తీసుకుంటే పుట్టబోయే పిల్లలు ఆరోగ్యవంతంగా ఉంటారని పేర్కొన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలు పౌష్టికాహారంపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వంటల పోటీలలో విజేతలుగా నిలిచిన మహిళలకు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో సీడీపీవో జ్యోతి, సూపర్‌వైజర్లు భాగ్యలక్ష్మి, రాధలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ప్రజలు ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలి

సీపీ సాయిచైతన్య

లక్కీ డ్రా విజేతల ప్రకటన

ఖలీల్‌వాడి: నిజామాబాద్‌ ఆర్టీసీ రీజియన్‌ ఆధ్వర్యంలో దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల కోసం నిర్వహించిన ప్రత్యేక లక్కీ డ్రా విజేతలను సీపీ సాయిచైతన్య ప్రకటించారు. జిల్లా కేంద్రంలోని ఆర్‌ఎం కార్యాలయంలో బుధవారం నిర్వహించిన లక్కీ డ్రా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొదటి బహుమతి చంద్రయ్య (రూ.25 వేలు), ద్వితీయ బహుమ తి షేక్‌ బాబర్‌ (రూ.15వేలు), తృతీయ బహుమతి రాంప్రసాద్‌ (రూ.10 వేలు) అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడు తూ ప్రజలు ఎల్లప్పుడూ ప్రభుత్వ రవాణా సంస్థ సేవలను వినియోగించుకోవాలన్నా రు. ఆర్టీసీ ఆర్‌ఎం జ్యోత్స్న మాట్లాడుతూ ప్రతి ప్రయాణికుడి సహకారమే సంస్థ విజయానికి మూలాధారమన్నారు. కార్యక్రమంలో టీజీఎస్‌ఆర్టీసీ డిప్యూటీ రీజినల్‌ మేనేజర్‌ యస్‌. మధుసూదన్‌, పీవోటీ పద్మజ, ఏవో పరమాత్మ, డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆనంద్‌ బాబు, డిపో మేనేజర్లు, అధికార సిబ్బంది, ప్రయాణికులు పాల్గొన్నారు.

టీచర్‌ డిప్యుటేషన్‌ రద్దు చేయాలి

బడికి తాళం వేసిన గ్రామస్తులు

ఇందల్వాయి: ఉపాధ్యాయురాలిని డిప్యుటేషన్‌పై ఇతర పాఠశాలకు పంపించడాన్ని నిరసిస్తూ డొంకల్‌ గ్రామస్తులు బుధవారం ప్రాథమికోన్నత పాఠశాలకు తాళం వేశారు. అనంతరం విద్యార్థులను ఇంటికి పంపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలలో 37 మంది విద్యార్థులకు నలుగురు ఉపాధ్యాయులు ఉన్నారని, ఉపాధ్యాయురాలు అర్చన పిల్లలతో చనువుగా ఉంటూ చక్కగా పాఠాలు చెప్తున్నారనే తమ పిల్లలని పాఠశాలలో చేర్పించామన్నారు. ఇప్పుడు ఆ టీచర్‌నే డిప్యుటేషన్‌పై పంపించడం సరికాదన్నారు. టీచర్‌ డిప్యుటేషన్‌ రద్దు చేస్తేనే పాఠశాల తాళం తీసి విద్యార్థులను పంపుతామని వారు తెలిపారు.

కొనసాగుతున్న నీటి విడుదల1
1/2

కొనసాగుతున్న నీటి విడుదల

కొనసాగుతున్న నీటి విడుదల2
2/2

కొనసాగుతున్న నీటి విడుదల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement