
క్రైం కార్నర్
అడవిపంది దాడిలో
మహిళకు గాయాలు
ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డి మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన సత్యంగారి ఏసవ్వపై అడవిపంది దాడి చేసినట్లు స్థానికులు బుధవారం తెలిపారు. ఏసవ్వ పొలానికి వెళ్తున్న సమయంలో అడవిపంది దాడి చేసింది. దీంతో ఆమె కాలు విరిగింది. గాయపడిన ఏసవ్వను ఎల్లారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించగా వైద్యులు కామారెడ్డికి రిఫర్ చేశారు.
ఇసుక వాహనం సీజ్
మద్నూర్(జుక్కల్): డోంగ్లీ మండలంలోని కుర్లా సమీపంలో ప్రభుత్వ ఇసుక క్వారీ నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న బోలెరో వాహనాన్ని బుధవారం ఉదయం పట్టుకున్నట్లు డోంగ్లీ ఆర్‌ఐ సాయిబాబా తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఇసుక అక్రమ తరలింపుపై తనిఖీలు నిర్వహిస్తుండగా ప్రభుత్వ క్వారీ వద్ద ఉన్న ఇసుక కుప్పల నుంచి అనుమతులు లేకుండా ఇసుకను డంప్ చేసుకొని వెళ్తుండగా డోంగ్లీలో పట్టుకున్నామన్నారు. వాహనాన్ని డోంగ్లీ తహసీల్ కార్యాలయానికి తరలించామని తెలిపారు.

క్రైం కార్నర్

క్రైం కార్నర్