
ఏరియా ఆస్పత్రిని సందర్శించిన ఏఎస్‌సీఐ
ఆర్మూర్‌టౌన్: పట్టణంలోని ఏరియా ఆస్పత్రిని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఏఎస్‌సీఐ) వైద్య బృందం బుధవారం సందర్శించింది. వైద్యులు హరికృష్ణ, రేష్మతోపాటు బృందం సభ్యులు ఆస్పత్రిలో అందిస్తున్న వైద్యసేవలు, పరికరాలు, స్టాఫ్ హాజరు, శుభ్రత, రోగుల క్షేమం తదితర వాటి వివరాలను సేకరించారు. ఆస్పత్రికి కావాల్సిన పరికరాలు, ఇతర సౌకర్యాలపై సూపరిటెండెంట్ ప్రమీదరెడ్డిను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి మెరుగుదల కోసం సిఫార్సులతో కూడిన నివేదికను రాష్ట్ర ఆరోగ్య శాఖకు అందజేస్తామని బృందం సభ్యులు తెలిపారు. వారి వెంట వైద్యులు అమృత్‌రాంరెడ్డి, మోహన్‌రెడ్డి, అజయ్ తదితరులు ఉన్నారు.