స.హ.చట్టం అమలులో ఆదర్శంగా నిలవాలి | - | Sakshi
Sakshi News home page

స.హ.చట్టం అమలులో ఆదర్శంగా నిలవాలి

Oct 9 2025 2:45 AM | Updated on Oct 9 2025 2:45 AM

స.హ.చట్టం అమలులో ఆదర్శంగా నిలవాలి

స.హ.చట్టం అమలులో ఆదర్శంగా నిలవాలి

దరఖాస్తులను నిర్ణీత వ్యవధిలో

పరిష్కరించాలి : కలెక్టర్‌

నిజామాబాద్‌ అర్బన్‌: పారదర్శకత, జవాబుదారీతనం కోసం ఉద్దేశించిన సమాచార హక్కు చట్టాన్ని అన్ని ప్రభుత్వ శాఖలలో సమర్థవంతంగా అమలు చేస్తూ జిల్లాను ఆదర్శంగా నిలుపాలని కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి సూచించారు. ఆర్‌టీఐ వారోత్సవాలను పురస్కరించుకుని జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. సబ్‌ కలెక్టర్లు, ఆర్డీవోల నేతృత్వంలో గురువారం నిజామాబాద్‌, బోధన్‌, ఆర్మూర్‌లలో డివిజనల్‌ స్థాయిలో, శుక్ర వారం తహసీల్దార్ల ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాలలో మండల స్థాయిలో సమాచార హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. ఆయా శాఖల పీఐవోలు, ఏపీఐవోలు తప్పనిసరిగా హాజరయ్యేలా చూడాలన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పౌర సమాచార అధికారి (పీఐవో), సహాయ పౌర సమాచార అధికారి (ఏపీఐవో), అప్పిలేట్‌ అధికారి వివరాల తో కూడిన సమాచార హక్కు చట్టం బోర్డును విధి గా ప్రదర్శించాలని ఆదేశించారు. ఆర్‌టీఐ అమలుకు సంబంధించి తప్పనిసరిగా రిజిస్టర్‌ ను నిర్వహిస్తూ, ఎప్పటికప్పుడు వివరాలను పొందుపరచాలని సూ చించారు. 4(1బి) రిజిస్టర్లోని సమాచారంతో కూడిన బుక్‌ లెట్‌ను అన్ని కార్యాలయాలలో అందుబాటులో ఉంచాలని, పీరియాడికల్‌ రిపోర్ట్స్‌ను క్రమం తప్పకుండా సేకరించాలని, కనీసం మూడు మాసాలకు ఒకసారి ఆర్‌టీఐ అమలుపై సమీక్ష జరపాలన్నారు. దరఖాస్తుదారు రెండవ అప్పిలేట్‌ అథారిటీకి వెళ్లే ఆస్కారం లేకుండా కోరిన సమాచారాన్ని నిర్ణీత ఫార్మాట్‌లో అందించాలన్నారు. ఆర్‌టీఐ దరఖాస్తుల పరిష్కారంలో అనవసర కాలయాపన చేస్తే జరిమానాలకు గురి కా వాల్సి వస్తుందని, ఇది పదోన్నతులు, ఇంక్రిమెంట్లు వంటి వాటిపై కూడా ప్రభావం చూపే ప్రమాదం ఉంటుందన్నారు. రిసోర్స్‌ పర్సన్లు కిషన్‌, కృష్ణాజీ సమాచార హక్కు చట్టంపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ కిరణ్‌ కుమార్‌, ట్రెయినీ కలెక్టర్‌ కరోలిన్‌ చింగ్తియాన్‌, జెడ్పీ సీఈవో సాయాగౌడ్‌, నగర పాలక సంస్థ కమిషనర్‌ దిలీప్‌ కుమార్‌, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్‌ సందీప్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement