
అద్దె బస్సులతో ఆదాయం
డొంకేశ్వర్(ఆర్మూర్): సెర్ప్ అందిస్తోన్న రుణంతో మండల సమాఖ్యలు త్వరలోనే అద్దె బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి ఇవ్వనున్నాయని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి సాయాగౌడ్ తెలిపారు. జిల్లా పరిషత్ మీటింగ్ హాల్‌లో గురువారం జిల్లా సమాఖ్య సమావేశం నిర్వహించారు. డీఆర్డీవో మాట్లాడుతూ ప్రభుత్వం ఒక్కో మండల సమాఖ్యకు రూ.30 లక్షల రుణమిచ్చి బస్సులు కొనుగోలు చేయిస్తుందని, ఈ బస్సులను ఆర్టీసీకి అద్దెకు ఇస్తే నెలకు రూ.70 వేల వరకు ఆదాయం వస్తుందన్నారు. మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి రుణాలను లక్ష్యానికి అనుగుణంగా పంపిణీ చేయాలన్నారు. మేకలు, గొర్రెలు, పెరటి కోళ్ల పెంపకానికి సీ్త్రనిధి ద్వారా రుణాలు అందజేయాలన్నారు. సమావేశంలో ఏపీడీ మధుసూదన్, డీపీఎంలు నీలిమా, కిరణ్, సంధ్యారాణి, మోహన్, రాజేశ్వర్, జెడ్‌ఎస్ అధ్యక్షురాలు హేమలత, కార్యదర్శి మమత పాల్గొన్నారు.
● డీఆర్డీవో సాయాగౌడ్