
గుండెపోటుతో న్యాయవాది మృతి
నిజామాబాద్ లీగల్: నగరానికి చెందిన న్యాయ వాది పెద్దగాని కిరణ్ కుమార్ గౌడ్ (57) గుండెపోటుతో మృతి చెందాడు. కిరణ్ శుక్రవారం సాయంత్రం ఆఫీసర్స్ క్లబ్‌కు చేరుకున్న కొద్దిసేపటికి చాతిలో నొప్పిగా ఉందని చెప్పడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స ప్రారంభిస్తుండగానే గుండెపోటుతో ప్రాణాలు వదిలాడు. 1997లో న్యాయవాద వృత్తిలో ప్రవేశించిన కిరణ్ కుమార్ గౌడ్, సీనియర్ న్యాయవాది నారాయణరెడ్డి వద్ద జూనియర్‌గా పనిచేశాడు, న్యాయవాదిగా సివిల్, క్రిమినల్ కేసులు వాదించాడు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. గవర్నమెంట్ ప్లీడర్‌గా, న్యాయవాదుల సొసైటీ వ్యవస్థాపక సభ్యుడిగా, ఆఫీసర్స్ క్లబ్ కార్యదర్శిగా పనిచేశాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కిరణ్ మృతిపట్ల నిజామాబాద్ బార్ అసోసియేషన్ సోమవారం సంతాప సభ నిర్వహించనున్నట్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిళ్ల సాయిరెడ్డి తెలిపారు.
చికిత్స పొందుతూ మహిళ ..
రుద్రూరు: ఆత్మహత్యకు యత్నించిన ఓ వృద్ధురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు రుద్రూర్ ఎస్సై సాయన్న వెల్లడించారు. వివరాలు ఇలా.. మండలంలోని బొప్పాపూర్ గ్రామానికి చెందిన గాండ్ల సావిత్రి (62) ఈనెల 11న కడుపునొప్పి బాధ భరించలేక యాసిడ్ తాగి ఆత్మహత్యకు య త్నించింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతురాలి కొడుకు అశోక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.