
రోడ్డు ప్రమాదాలపై సమగ్ర దర్యాప్తు చాలా కీలకం
ఖలీల్‌వాడి: రోడ్డు ప్రమాదాలపై సమగ్ర దర్యాప్తు చాలా కీలకమని సీపీ సాయిచైతన్య అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో శుక్రవారం క్రాష్ ఇన్వెస్టిగేషన్ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి సీపీ ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన అవసరమని సీపీ అన్నారు.
ప్రతి ప్రమాదం వెనక ఉన్న అసలైన కారణాలను వెలికితీసి, భవిష్యత్‌లో అలాంటి ఘటనలు జరగకుండా చూసేందుకు సహాయపడుతుందన్నారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రతి పోలీస్ సిబ్బంది సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని సూచించారు. డీసీపీ (అడ్మిన్) బస్వారెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, వర్షా నిహంత్, సేవ్ లైఫ్ ఫౌండేషన్ ప్రతినిధులు సాహెల్ మోటో, నూర్ ఖాట్టర్ పాల్, చిరాగ్ కాటేగర్, సీటీసీ సర్కిల్ సీఐ శివరాం తదితరులు పాల్గొన్నారు.