
నూతన కార్యవర్గం ఎన్నిక
సుభాష్‌నగర్: నగరశివారులోని శ్రావ్యగార్డెన్‌లో శుక్రవారం తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్ ఎన్‌పీడీసీఎల్ డిస్కం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎన్‌పీడీసీఎల్ డిస్కం కార్యవర్గ ఎన్నికలు (16 జిల్లాలు) నిర్వహించారు. ఎన్‌పీడీసీఎల్ డిస్కం అధ్యక్షుడిగా బి రఘునందన్, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా సత్తిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఎస్ వెంకట రమణరావు, అదనపు కార్యదర్శిగా ఎండీ ఆరీఫ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర నాయకులు సన్మానించి, వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ప్రధానకార్యదర్శి సాయిబాబు, అదనపు కార్యదర్శి వరప్రసాద్, కోశాధికారి శ్రీనివాస్‌రెడ్డి, డిస్కం కార్యదర్శి శేషగిరి రావు, అదనపు కార్యదర్శి రంగారావు, జిల్లా ముఖ్య సలహాదారులు లక్ష్మణ్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రాజేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ డీసీ రాజు, 16 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.