
కట్టని గోడలు.. ఈ బండరాళ్లు
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి ప్రతియేటా గోదావరిలోకి వదిలే మిగులు జలాల తాకిడిని బండరాళ్లు తట్టుకొని నిలబడుతున్నాయి. 42 వరద గేట్ల ద్వారా నీటిని వదిలినా బండరాళ్లు చెక్కుచెదరకుండ కట్టని గోడలా నిలబడుతున్నాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణం ముందుగా కుస్తాపూర్ వద్దనే నిర్మించాలని నిర్ణయించారు. కాని విశాలమైన బండరాయి లేకపోవడంతో అక్కడి నుంచి, విశాలమైన బండరాళ్లు గల పోచంపాడ్‌కు మార్చి నిర్మించారు. ప్రస్తుతం వరద గేట్ల ద్వారా నీటి విడుదల నిలిపి వేయడంతో ఈ బండరాళ్లు ప్రత్యేక అకర్షణగా నిలుస్తున్నాయి. దీంతో పర్యాటకులు ప్రాజెక్ట్ డ్యాం వైపు కంటే దిగువన గోదావరి వైపునకే వస్తున్నారు.

కట్టని గోడలు.. ఈ బండరాళ్లు