
మంత్రులు జిల్లా అభివృద్ధిపై దృష్టిపెట్టాలి
● కాంగ్రెస్ కామారెడ్డి బీసీ సభను బహిష్కరించాలి
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి
సుభాష్‌నగర్: జిల్లా ఇన్‌చార్జి మంత్రులు పర్యటనలు మా నుకుని జిల్లా అభివృద్ధి, వరద బాధిత కుటుంబాలను ఆదుకోవడంపై దృష్టిసారించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి డిమాండ్ చేశారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. వరద బాధితుల పట్ల ప్రభుత్వం, మంత్రులు కనీసం కనికరం చూపకపోవడం సిగ్గుచేటన్నారు. కామారెడ్డిలో వరద బాధితులకు రూ.11,500 పంపిణీ చేశారని, కానీ రూరల్ నియోజకవర్గంలో బాధితులను పట్టించుకోలేదన్నారు. కామారెడ్డిలో కాంగ్రెస్ నిర్వహించేది బీసీల సభ కాదని, మైనార్టీ రిజర్వేషన్ల కోసం నిర్వహించే బహిరంగ సభ అని విమర్శించారు. సభకు బీసీలు, బలహీనవర్గాలు, బీసీ సంఘాలు దూరంగా ఉండాలని, ఆ సభను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. నాయకులు న్యాలం రాజు, నాగోళ్ల లక్ష్మీనారాయణ, ప్రమోద్, మాస్టర్ శంకర్, జ్యోతి, నాగరాజు, ఓంసింగ్, శ్రీనివాస్‌రెడ్డి, తారక్ వేణు, అంబదాస్, ఆకుల శ్రీనివాస్, హరీష్‌రెడ్డి పాల్గొన్నారు.