
బ్యాక్టీరియా బారిన వరి
సూచించిన మందులే వాడాలి
డొంకేశ్వర్(ఆర్మూర్): చిరు పొట్ట దశకు వచ్చిన వరి పంటపై ఎండాకు తెగులు బ్యాక్టీరియా దాడి చేస్తోంది. మోతాదుకు మించి యూరియా వాడకం, తీవ్రమైన ఎండలు, అధిక వానలతో ఎండాకు తెగులు సోకే అవకాశం ఉందని వ్యవసాయాధికారులు చెప్తున్నారు. దీనిని నివారించే మందులు లేకపోగా.. ఒక మొక్కనుంచి మరో మొక్కకు వ్యాపించకుండా యాంటీ బయాటిక్స్ రసాయనిక మందులు పిచికారీ చేయడమే మార్గమని సూచిస్తున్నారు.
4,34,695 ఎకరాల్లో సాగు..
ఖరీఫ్ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 4,34,695 ఎకరాల్లో రైతులు వరిని సాగు చేస్తున్నారు. ప్రస్తుతం పొలాలన్నీ చిరు పొట్ట దశకు చేరుకున్నాయి. విత్త నాలు బయటికి వచ్చే సమయంలో ఎండాకు తెగు లు సోకడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మొక్క పైభాగంలో తెచ్చటి మచ్చలు ఏర్పడి ఆకు లు పూర్తిగా ఎండిపోతున్నాయి. ఇది ఒకటి, రెండు మొక్కలతో మొదలై పొలమంతా వ్యాపిస్తోంది. త ద్వారా దిగుబడిపై ప్రభావం పడుతుంది. అయితే, ఇటీవల కురిసిన భారీ వర్షాలు, ఆ వెంటనే తీవ్రమైన ఎండలతో వాతావరణం నిలకడగా లేదు. దీనికి తోడు రైతులు పరిమితికి మించి యూరియా చల్లారు. వాస్తవానికి ఎకరానికి మూడు డోసులు కలిపి రెండు నుంచి మూడు బస్తాలు సరిపోతుంది. కానీ, రైతులు పొలం త్వరగా ఎదగాలనే ఉద్దేశంతో ఎకరానికి నాలుగైదు, అంతకుమించి బస్తాల యూరియా వేశారు. దీంతో తెగుళ్లు, చీడపీడలు సోకుతున్నాయని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. పంటకు సోకిన బ్యాక్టీరియా పూర్తిగా వ్యాపించకుండా రైతులు యాంటీ బయాటిక్స్ మందులను స్ప్రే చేస్తున్నారు.
ఎండాకు తెగులు వ్యాప్తిని అరికట్టే యాంటీ బయా టిక్స్ రసాయనాలు అందుబాటులో ఉన్నాయి. అగ్రి మైసన్ లేదా ప్లాంటమైసిన్‌తో కాపర్ ఆక్సిక్లోరైడ్ పిచికారీ చేయాలి. సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. స్థానిక వ్యవసాయాధికారులను రైతులు సంప్రదించాలి. పూత దశలో ఉన్నప్పుడు కాపర్ సంబంధిత శీలింధ్ర నాశినులు వాడొద్దు.
– మధుసూదన్, ఏవో, డొంకేశ్వర్
చిరు పొట్ట దశలో సోకిన ఎండాకు తెగులు
అధిక యూరియా, వాతావరణ మార్పులే కారణమంటున్న
వ్యవసాయ అధికారులు
విస్తరించకుండా యాంటీబయాట్సిక్ వినియోగిస్తున్న రైతులు

బ్యాక్టీరియా బారిన వరి