
రోగుల బారులు..
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జీజీహెచ్‌లో ఓపీ వద్ద బారులు తీరిన రోగులు
ఇటీవల కురిసిన వర్షాల వల్ల సీజనల్ వ్యాధుల ప్రభావంతో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో గురువారం 2,156 మంది అవుట్ పేషెంట్లు నమోదయ్యారు. జ్వరాలు, దగ్గు, వాంతులు, విరేచనాలతో ఆస్పత్రికి వస్తున్నారు. ఒకే రోజు రెండువేలకుపైగా ఓపీ నమోదు కావడం ఈనెలలో తొలిసారి అని ఆస్పత్రి అధికారులు పేర్కొన్నారు.
– సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్