
భావప్రకటనపై పాశవిక దాడి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : భావ ప్రకటన స్వేచ్ఛను హరించేలా ఆంధ్రప్రదేశ్‌లోని చంద్రబా బు ప్రభుత్వం ‘సాక్షి’ ఎడిటర్ ఆర్ ధనంజయ్‌రెడ్డి, ఇతర పాత్రికేయులపై అక్రమంగా కేసులు బనా యించడంపై అన్ని వర్గాలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. 2024 జూన్ లో టీడీపీ ఆధ్వర్యంలోని కూట మి ప్రభుత్వం వచ్చాక పత్రికా స్వేచ్ఛను, ప్రశ్నించే గొంతులను భౌతిక దాడుల ద్వారా, పోలీసులను ఉపయోగించి తప్పుడు కేసులు పెట్టి తీవ్రంగా అణిచివేస్తున్నారు. ప్రజాసమస్యలు, వివి ధ సామాజిక అంశాలపై ప్రతిపక్ష పార్టీల నాయ కులు నిర్వహించిన ప్రెస్‌మీట్లకు సంబంధించిన వా ర్తలు రాసిన సందర్భంలో ‘సాక్షి’ దినపత్రికతో పా టు ఎడిటర్, ఇతర జర్నలిస్టులపై కేసులు నమోదు చేస్తూ, భావ ప్రకటనా స్వేచ్ఛను తమ గుప్పిట్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల పక్షాన పనిచేసే జర్నలిస్టుల గొంతులను నొక్కేస్తున్న అప్రజాస్వామిక చర్యలపై పలువురి స్పందనలు..
పత్రికా స్వేచ్ఛను హరించడం దుర్మార్గం
సాక్షి ఎడిటర్, పాత్రికేయులపై
అక్రమ కేసుల నేపథ్యంలో
పలువురి సంఘీభావం
చంద్రబాబు ప్రభుత్వ తీరుపై ఖండన