
చదువులో వెనుకబడ్డ వారిపై శ్రద్ధ వహించాలి
నిజామాబాద్‌అర్బన్: చదువులో వెనుకబడ్డ విద్యార్థులపై అధ్యాపకులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రవికుమార్ అన్నారు. నగరంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం అధ్యాపకులు, బోధనేతర సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ప్రతి అధ్యాపకుడు విద్యార్థుల హాజరుపై ప్రత్యేక శ్రద్ధ వహించి, ఫేస్ రికగ్నేషన్ సిస్టం ద్వారా హాజరు తీసుకోవాలని ఆదేశించారు. స్లిప్‌టెస్ట్‌లు నిర్వహించి మార్కులను రిజిస్టర్లలో ఎంట్రీ చేయాలని సూచించారు. కళాశాలలో నెలకొన్న అదనపు అధ్యాపకుల కొరతను ఇంటర్ బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. సమావేశంలో బుద్ధిరాజ్, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.