
క్షయవ్యాధి నిర్మూలనే ధ్యేయం
● జిల్లా వైద్యాధికారిణి రాజశ్రీ
● బెటాలియన్‌లో ఆరోగ్య శిబిరం
డిచ్‌పల్లి: దేశంలో క్షయవ్యాధిని పూర్తిగా నిర్మూలించడానికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని నిజామాబాద్ జిల్లా వైద్యాధికారిణి (డీఎంహె చ్‌వో) రాజశ్రీ అన్నారు. డిచ్‌పల్లి మండలం టీజీఎస్పీ ఏడో బెటాలియన్‌లో మంగళవారం టీబీముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా క్షయవ్యాధి నిర్ధారణ వైద్య శిబిరాన్ని డీఎంహెచ్‌వో ప్రారంభించి మాట్లాడారు. సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. వారానికి మించి ఎవరైనా దగ్గు, జ్వరంతో బాధపడుతున్నట్లయితే వెంటనే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి వెళ్లి తెమడ పరీక్ష చేయించుకోవాలని సూచించారు. వైద్య శిబిరంలో పలువురికి క్షయవ్యాధి పరీక్షలు నిర్వహించారు. అలాగే బెటాలియన్‌లోని సిబ్బంది ఇంటింటికి వెళ్లి కుటుంబసభ్యులకు జ్వర పరీక్షలు నిర్వహించారు. కమాండెంట్ సత్యనారాయణ, అసిస్టెంట్ కమాండెంట్ శరత్, జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారిణి అవంతి, బెటాలియన్ యూనిట్ మెడికల్ ఆఫీసర్ అనుపమ, ఇందల్వాయి పీహెచ్‌సీ వైద్యాధికారి షారోన్ షైని క్రిస్టినా, జిల్లా టీబీ కోఆర్డినేటర్ రవి, ఆయుష్మాన్ ఆరోగ్యం మందిర్ డాక్టర్ అరుణ్, స్వప్న, సుచరిత, హెచ్‌ఈవో శంకర్, సూపర్‌వైజర్లు దేవపాలం, రాజేందర్, పద్మ, ఏఎన్‌ఎంలు అరుంధతి, సంధ్య, సిబ్బంది పాల్గొన్నారు.