వారిదే ఇష్టారాజ్యం! | - | Sakshi
Sakshi News home page

వారిదే ఇష్టారాజ్యం!

Aug 6 2025 6:20 AM | Updated on Aug 6 2025 6:20 AM

వారిద

వారిదే ఇష్టారాజ్యం!

నిజామాబాద్‌

సబ్సిడీపై వ్యవసాయ..

సాగులో రైతులకు వెన్నుదన్నుగా ఉండేందుకు వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ప్రారంభించింది.

బుధవారం శ్రీ 6 శ్రీ ఆగస్టు శ్రీ 2025

– 10లో u

● ఆర్మూర్‌ నియోజకవర్గంలో 192 పనులకుగాను 41 పనులు పూర్తి అయ్యాయి. ఒక పని పురోగతిలో ఉంది. 150 పనులు ఇంకా ప్రారంభించలేదు. ఇప్పటి వరకు రూ.1,11,37,346 ఖర్చు చేశారు.

● బాల్కొండ నియోజకవర్గంలో 290 పనులకు గాను 55 పనులు పూర్తి అయ్యాయి. ఒక పని పురోగతిలో ఉంది. 234 పనులు ఇంకా ప్రారంభించలేదు. రూ.1,70, 52,858 ఖర్చు చేశారు.

● బోధన్‌ నియోజకవర్గంలో 158 పనులు చేపట్టాలని నిర్ణయించారు. వీటిలో 14 పనులు మాత్రమే పూర్తి అయ్యాయి. ఒక పని పురోగతిలో ఉంది. 143 పనులు ఇంకా ప్రారంభించలేదు. రూ.67,73,847 ఖర్చు చేశారు.

● నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గంలో 178 పనులను చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో ఇప్పటి వరకు 29 పనులు మాత్రమే పూర్తి చేశారు. ఒక పని పురోగతిలో ఉంది. 148 పనులు ఇంకా ప్రారంభించలేదు. రూ.1,52,52,025 ఖర్చు చేశారు.

● నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలో 304 పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో ఇప్పటి వరకు 86 పనులు పూర్తి అయ్యాయి. ఒక పని పురోగతిలో ఉంది. 217 పనులు ప్రారంభం కాలేదు. రూ.1,91,19,168 ఖర్చు చేశారు.

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌ : అధికారం మనదే కదా, మనం ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు. నియోజకవర్గాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంజూరైన ప్రత్యేక నిధులను అధికార పార్టీ నియోజకవర్గాల ఇన్‌చార్జులు జిల్లా ఇన్‌చార్జి మంత్రి ద్వారా తమ ఇష్టం వచ్చిన పనులకే ఖర్చు పెడుతున్నారు.

జిల్లాలోని ఆర్మూర్‌, బోధన్‌, నిజామాబాద్‌ రూరల్‌, నిజామాబాద్‌ అర్బన్‌, బాల్కొండ నియోజకవర్గాలకు 2024–25 సంవత్సరానికి గాను రూ.10 కోట్ల చొప్పున మొత్తం రూ.50 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధుల ద్వారా ఈ ఐదు నియోజకవర్గాల్లో మొత్తం 1,122 పనులు మంజూరయ్యాయి. వీటిలో 225 పనులు పూర్తయ్యాయి. 5 పనులు జరుగుతున్నాయి. మరో 892 పనులు ఇంకా మొదలు కాలేదు.

మొత్తం రూ.50 కోట్ల లో ఇప్పటివరకు రూ. 6,93,35,244 ఖర్చు చేశా రు. నియోజకవర్గాల్లో ప్రజలచేత గెలుపొంది ప్రాతి నిధ్యం వహిస్తున్న విపక్ష ఎమ్మెల్యేలను కాదని అధి కార పార్టీ నాయకులు చెప్పినట్లే పనులు చేస్తున్నా రు. ప్రజల ఓట్లతో గెలుపొంది ప్రాతినిధ్యం వహిస్తున్న తమకు అభివృద్ధి పనుల కోసం ఒక్క పైసా లేకుండా చేయడమేమిటని బాల్కొండ బీఆర్‌ఎస్‌ ఎ మ్మెల్యే వేముల ప్రశాంత్‌రె డ్డి, ఆర్మూర్‌ బీజేపీ ఎమ్మె ల్యే పైడి రాకేష్‌రెడ్డి, నిజా మాబాద్‌ అర్బన్‌ బీజేపీ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ ఆగ్రహం వ్య క్తం చేస్తున్నారు.

సీడీపీ నిధులు పైసా ఇవ్వలేదు..

నగరాభివృద్ధిని కాంక్షించిన ప్రజలు నన్ను ప్రజాప్ర తినిధిగా గెలిపించారు. ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్కపైసా సీడీపీ నిధులు ఇవ్వలేదు. ప్రత్యేక అభివృద్ధి నిధుల కింద వచ్చిన డబ్బుల్లో ఒక్కపైసా కూడా ఎమ్మెల్యే ద్వారా ఖర్చు చేయడం లేదు. అధికార పార్టీ నాయకులే ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేస్తున్నా రు. రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నారు.

– ధన్‌పాల్‌ సూర్యనారాయణ, నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే

అప్రజాస్వామికం..

ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికై న ఎమ్మెల్యేలకు అభివృద్ధి నిధులు కేటాయించకపోవడం శోచనీయం. అధికార పార్టీ నాయకులు పూర్తి అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అసమర్థతపై ప్రశ్నిస్తే ఇళ్లపై దాడులు చేసే సంస్కృతికి తెరతీశారు. ఇది మంచి పద్ధతి కాదు.

– వేముల ప్రశాంత్‌రెడ్డి, బాల్కొండ ఎమ్మెల్యే

ఇది మంచి పద్ధతి కాదు..

ఆర్మూర్‌ ప్రజలు భారీ మెజారిటీతో నన్ను గెలిపించారు. నా దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారం కో సం ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వలేదు. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌కు మాత్రం రూ.వెయ్యి కోట్లు కేటాయించడం అసమతుల్యానికి నిదర్శనం. అధికార పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్లు చేస్తే భవిష్యత్‌ తరాలకు ఏమి చెప్పాలి.

– పైడి రాకేష్‌రెడ్డి, ఆర్మూర్‌ ఎమ్మెల్యే

న్యూస్‌రీల్‌

విపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గ్గాల్లో

అధికార పార్టీ నేతల పెత్తనం

వారు ప్రతిపాదించిన పనులకే

ప్రత్యేక నిధుల వినియోగం

జిల్లా ఇన్‌చార్జి మంత్రి ద్వారా

నిధుల కేటాయింపులు

నిస్సహాయ స్థితిలో విపక్ష పార్టీల ప్రజాప్రతినిధులు

ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారని

ఆగ్రహావేశాలు

వారిదే ఇష్టారాజ్యం!1
1/3

వారిదే ఇష్టారాజ్యం!

వారిదే ఇష్టారాజ్యం!2
2/3

వారిదే ఇష్టారాజ్యం!

వారిదే ఇష్టారాజ్యం!3
3/3

వారిదే ఇష్టారాజ్యం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement