శతాధిక వృద్ధురాలు మృతి | - | Sakshi
Sakshi News home page

శతాధిక వృద్ధురాలు మృతి

Aug 8 2025 9:07 AM | Updated on Aug 8 2025 2:02 PM

శతాధిక వృద్ధురాలు మృతి

శతాధిక వృద్ధురాలు మృతి

బోధన్‌రూరల్‌: మండలంలోని పెంటాకుర్దు గ్రా మానికి చెందిన శతాధిక వృద్ధురాలు దొబ్బ మా రుబాయి (105) గురువారం మృతిచెందింది. గ్రా మానికి చెందిన ఆమె గ్రామంలో గర్భిణులకు నా ర్మల్‌ డెలివరీలు చేయడంతో పేరుపొందింది. గత 75 ఏళ్లల్లో గ్రామంలో సుమారు వెయ్యికి పైగా ప్రసవాలు చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామపెద్దలు, గ్రామస్తులు మారుబాయి మృతదేహానికి నివాళులు అర్పించి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

దాడి ఘటనలో ఇద్దరిపై కేసు నమోదు

రెంజల్‌(బోధన్‌): ఒకరిపై దాడికి పాల్పడిన ఘటనలో మండలంలోని వీరన్నగుట్ట తండా గ్రామానికి చెందిన జాదవ్‌ రాజుతోపాటు అతడి మిత్రుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై చంద్రమోహన్‌ గురువారం తెలిపారు. వీరన్నగుట్ట గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు గ్రామానికి చెందిన వీరయ్య నైట్‌ వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. అతడు బుధవారం అర్ధరాత్రి విధులు నిర్వహిస్తుండగా రాజుతోపాటు అతని స్నేహితుడు అనుమానాస్పదంగా తిరుగుతున్నారు. దీంతో వీరయ్య వారిని ఈ సమయంలో ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్నించగా, వారు అతడిపై దాడి చేశారు. ఈమేరకు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.

మోపాల్‌ మండలంలో ముగ్గురిపై..

మోపాల్‌: మండలంలోని కంజర్‌ గ్రామంలో మహిళపై దాడి చేసిన ఘటనలో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సుస్మిత తెలిపారు. గ్రామానికి చెందిన కొత్తోళ్ల రాధాతో మోహన్‌, లక్ష్మి, అనితకు పాత గొడవలు ఉన్నాయి. ఈక్రమంలో రాధకు చెందిన వ్యవసాయ క్షేత్రంలోకి గురువారం వారు వచ్చి అకారణంగా దాడి చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

పేకాడుతున్న 24మంది అరెస్టు

మద్నూర్‌(జుక్కల్‌): మండలంలోని రెండు పేకాట స్థావరాలపై పోలీసులు గురువారం దాడులు నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం రావడంతో బిచ్కుంద సీఐ రవికుమార్‌, మద్నూర్‌ ఎస్సై విజయ్‌ కొండ ఆధ్వర్యంలో పేకాట స్థావరాలపై దాడులు చేసి, పేకాడుతున్న 24 మందిని అదుపులోకి తీసుకొని అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి రూ. 34వేల నగదు, 19 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వారిలో డోంగ్లీ మండలం మదన్‌హిప్పర్గాలో 20 మందిని, మద్నూర్‌ మండలం పెద్ద శక్కర్గాలో నలుగురిని పట్టుకున్నట్లు వారు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఇసుక డంపు స్వాధీనం

రుద్రూర్‌: పోతంగల్‌ మండలం కల్లూర్‌ శివారులో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంప్‌ను గురువారం తహసీల్దార్‌ గంగాధర్‌ స్వాధీనం చేసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్లకు కేటాయించిన ఇసుకను కొందరు అక్రమంగా డంప్‌ చేసినట్టు గుర్తించారు. ఈ ఇసుకను వర్ని మండలం చింతల్‌పేట్‌ గ్రామంలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కేటాయించినట్టు ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement